ధర్మం – అధర్మం
“ధర్మం” అంటే ?
“దేనివల్లనైతే వెంటనే ఇహ, పరలోకాల్లో అభ్యుదయమూ
పరంపరగా శాశ్వత మోక్షమూ కలుగుతాయో . .
దానిని . . ‘ధర్మం‘ అంటారు”
అలాగే,
ఏ కర్మల వలన, ఏ చర్యల వలన,
ఇహలోకంలో గానీ, పరలోకలలో గానీ దుఃఖం సంభవించి
ఆత్మజ్ఞానాంకురణకు ఆస్కారం ఎప్పుడు కలుగదో . .
ఆ కర్మాచరణం “అధర్మం” అనిపించుకుంటుంది
- ధర్మాచరణ ఎప్పుడూ మనకే లాభకరం, కనుక అది సదా పరిగ్రహించవలసిందే
- అధర్మాచరణ ఎల్లప్పుడూ స్వంతానికే హానికరం, కనుక అది సదా పరిత్యజించవలసింది