ధమ్మపదంలో

 

ధమ్మపదం ఆధారంగా

బుద్ధ మహాత్ముడు చెప్పిన కొన్ని అమృత పలుకులు:

  • “అభిత్థరేథ కల్యాణే,” “అభిత్వరేత కల్యాణే” (సంస్కృతం) “మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి.”

 

  • “ఆరోగ్య పరమా లాభః, సన్తుష్టిః పరమం ధనం విస్సాస పరమా జజ్ఞాతిః, నిబ్బానం పరమం సుఖ – “ఆరోగ్య పరమా లాభామ్ సంతుట్ఠీ పరమం ధనమ్ విశ్వాస పరమో జ్ఞాతిః సన్తుష్టిః పరమం సుఖమ్”(సంస్కృతం) “ఆరోగ్యమే పరమ లాభం; సంతుష్టత అనేదే పరమ ధనం; విశ్వాసమే పరమ బంధువు; నిర్వాణమే పరమ సుఖం”

 

  • “సుఖా మత్తెయ్యతా లోకే, అథోపెత్తెయ్యతా సుఖా సుఖా సామజ్ఞతా లోకే, అథో బ్రమ్హతా సుఖా” – “సుఖా మాత్రీయతా లోకేథ పిత్రీయతా సుఖా సుఖా శ్రమణతా లోకేథ బ్రాహ్మణతా సుఖా” (సంస్కృతం) “ఈ లోకంలో మాతృత్వం ధన్యం; పితృత్వం కూడా ధన్యమే. శ్రమణత్వం ధన్యం; బ్రాహ్మణ్యం ధన్యం”

 

  • “అప్పమత్తోహి ఝాయన్తో, పప్పోతి విపులం సుఖం” “అప్రమత్తో హి ధ్యాయాన్, ప్రాప్నోతి విపులం సుఖమ్” (సంస్కృతం) “అప్రమత్తుడై ధ్యానించేవాడు విపులమైన సుఖాన్ని పొందుతాడు”

 

  • “అప్పమాదో అమతపదం, పమాదో మచ్చునోపదం” “అప్రమాదో అమృతపదం, ప్రమాదో మృత్యోఃపదమ్” (సంస్కృతం) “అప్రమత్తతే అమృతత్త్వం; ప్రమత్తతే మృత్యువుతో సమానం”