దేహమే దేవాలయం
ఆది శంకరాచార్యుల వారు అన్నారు – “దేహో దేవాలయో ప్రోక్తః జీవోద్దేవో సనాతనః” అంటే,
దేహమే దేవాలయం: జీవుడే సనాతనమైన దైవం అని అర్థం.
దేహం కాని దేవాలయం లేదు, జీవుడు కాని దేవుడు లేడు
దేహం లోనే ధ్యానం చేయాలి, దేహం ఉన్నదే ధ్యానం చేయడం కోసం, దేహం లేకపోతే ఎక్కడి ధ్యానం ?
దేహం నశించిన తర్వాత, జీవుడు పై లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ లబ లబ కొట్టుకోవాలి
అక్కడ దేహం లేదు కనుక ధ్యానం చేయలేడు, అప్పుడు చేయగలిగింది మరో జన్మ కోసం నిరీక్షణ ఒక్కటే
దేహం ధ్యానం కోసమే అని సదా జ్ఞప్తిలో వుంచుకుందాం
ధ్యానం వల్లనే జీవుడు దేవుడు అవుతాడు