చిరంజీవత్వం
“చిరంజీవత్వం” అన్నది సాధ్యమే
ఎందరో మహనీయులు దానిని సాధించారు
దానిని గురించి వేమన చెప్పినది:
“అకారణ విధ మెరుగుచు
చేకొని యా మూలధనము జెందుచునున్నన్
ఆకల్పాంతమును, సదా,
యే కాలము పిన్న వయస్సు ఇహమున వేమా”
“అకారణం” అంటే “దేనికైతే కారణం లేదో” . .
అంటే “మూలచైతన్యం” అన్నమాట
“అకారణ విధం” అంటే “చైతన్యాన్ని తెలుసుకునే విద్య”
“పిన్న వయస్సు” అంటే “చిరంజీవత్వం”
కనుక, పద్య భావం . .
“ఎవరైతే ‘మూల చైతన్యాన్ని’ గురించి
సంపూర్ణంగా తెలుసుకుని
ఆ ‘మూలధనం’ లో వృద్ధి చెందుతూ వుంటారో,
వారు అకల్పాంతం వరకు, ఎల్లప్పటికీ,
‘పిన్న వయస్కులు’ గానే ఈ లోకంలో ఉండగలరు” అని
- ఈవిధంగానే అంజనేయస్వామి గానీ, మహావతార్ బాబాజీ కానీ,
ఇంకా ఎంతో ఎంతో మంది యోగులు ‘చిరంజీవులు’ గా
ఇప్పటికీ భూమి మీద ఉన్నారు - లిండాగుడ్‌మాన్ వ్రాసిన “స్టార్ సైన్స్”
అనే పుస్తకంలో “చిరంజీవత్వం సాధించే విధానం”
గురించి మహా సుస్పష్టంగా వివరించి వుంది;
ఆ పుస్తకాన్ని అందరూ విధిగా చదివి తీరాలి