బుద్ధుని ప్రకారం బ్రాహ్మణుడు

 

నిర్వాణ స్థితిని పొందినవాడే ఒకానొక “బ్రాహ్మణుడు”

గౌతమ బుద్ధుడు ధమ్మపదంలో ఒకానొక “బ్రాహ్మణుణ్ణి”

ఈ క్రింది విధంగా నిర్వచించాడు:

* న చాహం బ్రామ్హణం బ్రూమి, యోనిజం మత్తిసంభవం

“కేవలం బ్రాహ్మణి అయిన తల్లి గర్భంలో జన్మించిన వానిని 

నేను ‘బ్రాహ్మణుడు’ అనను”

* పుట్టే నివాసం యో వేది, సగ్గాపాయఞ్చ్ పస్సతి

అథో జాతిక్ఖయం పత్తో, అభిఞ్ఞ్‌వోసితో ముని

సబ్బవోసితవోసానం, తమహం బ్రూమి బ్రామ్హణం

“పూర్వజన్మ జ్ఞానం కలవాడు

జ్ఞాననేత్రంతో స్వర్గాన్నీ నరకాన్నీ, చూసేవాడు

జన్మరాహిత్యం పొందినవాడు

ముని, కృతకృత్యుడు అయినవాడినే

నేను ‘బ్రాహ్మణుడు’ అంటాను”