బుద్ధియోగం ధ్యానజీవితం
ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో
బుద్ధ యోగము, ధ్యాన జీవితము
మైత్రీ దాయకము – క్షాంతి పూరితము
కరుణా ధామము – అహింసా ధర్మము
ఆనాపానసతి – హంసయానము
కర్మక్షాళనము – దివ్య నేత్రము
నిర్వాణాత్మకము – శూన్యభావము
ప్రజ్ఞాకారకము – మధ్యేమార్గము
ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో
బుద్ధ యోగము, ధ్యాన జీవితము