బుద్ధం శరణం గచ్ఛామి
జన్మ జన్మలకూ బుద్ధం శరణం గచ్ఛామి అన్న సూత్రం తప్ప అన్యధా శరణం నాస్తి. ఎవరికైనా, ఏలోకంలోనైనా.
మానవుడి మొదటి జన్మలలో అయినా సరే, మానవుడి మధ్య జన్మలో అయినా సరే, మానవుడి చివరి జన్మలలో అయినా సరే బుద్ధం శరణం గచ్ఛామి అన్న సూత్రం తప్ప వేరే శరణు అసంభవం.
ఎందుకంటే, పిల్లల నుంచి వృద్ధుల వరకూ, పామరుల నుంచి పండితుల వరకూ, సామాన్యుల నుంచి అసామాన్యుల వరకూ, శైశవాత్మల నుంచి వృద్ధాత్మల వరకూ – అందరికీ సరిసమానంగా వర్తించేదీ, అందరినీ సరిసమానంగా వృద్ధి పరిచేదీ తప్పితే విశ్వసృష్టి లో మరొకటి లేదు.
-
బుద్ధుడి ప్రతి పలుకూ దివ్యం, దివ్యం.
-
బుద్ధుడి ప్రతి చూపూ దివ్యం, దివ్యం.
-
బుద్ధుడి ప్రతి కదలికా దివ్యం, దివ్యం.
-
బుద్ధుడి ప్రతి మౌనమూ దివ్యం, దివ్యం.
-
బుద్ధుడు ఆచరించిన ధ్యానమే ధ్యానం.
-
బుద్ధుడు ప్రవచించిన జ్ఞానమే జ్ఞానం.
-
బుద్ధుడు జీవించిన జీవనమే జీవనం.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ధ్యానుల ధ్యాన రీతీ, జ్ఞాన రీతీ, జీవన తీరూ ఆ గౌతమ బుద్ధుని ధ్యాన రీతీ, జ్ఞాన రీతీ, జీవన రీతులలో సరిసమానంగా తూగగలగాలి.
తత్ లక్ష్య సాధనకే మన అందరి జీవితం అంకితం.
బుద్ధం శరణం గచ్ఛామి.
బుద్ధం శరణం గచ్ఛామి.
బుద్ధం శరణం గచ్ఛామి.