భ్రోగి .. భ్యోగి

 

“భోగి” + “రోగి” = “భ్రోగి”

“భ్రోగి” అంటే “భొగం,రోగం రెండూ కలగలిపి ఉన్నవాడు”
ఆధ్యాత్మిక జ్ఞానం, మరి సరియైన జీవనసరళి అన్నవి తెలియని వాళ్ళే “భ్రోగులు”
నూటికి 99.99% మానవులు రోగాలనూ, భోగాలనూ సరిసమానంగా
“రాత్రి-పగలు” గా అనుభవిస్తుంటారు “భ్రోగులు” 
ఈ “భ్రోగులు” – “రోగాలు రావడం ప్రకృతి సహజం” అనుకుంటారు 
వారికి “అనుక్షణ భోగత్వం” గురించి తెలియదు 
ఇకపోతే 

“భోగి” + “యోగి” = “భ్యోగి” 

“భ్యోగి” అంటే “భోగం, యోగం రెండూ కలగలిపి ఉన్నవాడు”
ఆధ్యాత్మిక విజ్ఞానులై, సరియైన ప్రాపంచిక జీవన సరళిలో ఉన్నవారే “భ్యోగులు”
నిజానికి భోగమే అందరూ వాంఛించేది, అదే అందరి గమ్యమూనూ
కానీ నూటికి 99.99% అనుక్షణ భోగులుగా వుండే మార్గం కానలేరు
“మన పాపాలే మన రోగాలు” అని యోగులకు మాత్రమే తెలుసు
“యోగం ద్వారానే సర్వరోగాలూ పోతాయి” అని కూడా వారి స్వీయ అనుభవం
“యోగం” అంటే ” అనుసంధానం ” అంటే ” స్వీయ పూర్ణాత్మతో తాదాత్మ్యం “
“నేను వేరే, మిగతావి వేరే ” అనే భావన ఉన్నప్పుడు, అదే ” అజ్ఞానం “
“మిగతా వాళ్ళను అణగద్రొక్కితేనే నేను బాగుంటాను” అన్నదే ” విశేష అజ్ఞానం”
అలాంటి భావనలు వున్నప్పుడు ఆ విధంగానే జీవించినప్పుడు .. 
మరి రోగాలు తప్పకుండా వచ్చి తీరుతాయి
అయితే ధ్యానయోగసాధన ద్వారానే అలాంటి అజ్ఞానపు భావనలు మౌలికంగా
తొలిగిపోతాయి .. అప్పుడు ఇంక మిగిలేది విరాజిల్లేది, క్షణ క్షణ భోగమే

* యోగి కాకముందు ప్రతి ఒక్కరూ భ్రోగి
* యోగి అయిన తరువాత అందరూ భ్యోగులే
* యోగీశ్వరుడే భోగేశ్వరుడు