బ్రహ్మమానస పుత్రులు

 

ఎప్పుడైతే మనం కూడా

పూర్ణాత్మ స్థితికి చేరగలమో చేరుతామో
అప్పుడు మనం కూడా
మనలో నుంచి అంశలను వేరుగా ఏర్పరచగలం
వీరే “బ్రహ్మ – మానస పుత్రులు”

అప్పుడు మనం కూడా
వాళ్ళను ‘క్రింద’ వున్న కారణలోకాలకు పంపి
ఒకప్రక్క
మన స్వంత పనులను మనం చూసుకుంటూనే
మరోప్రక్క
వారి బాగోగులను కూడా చూసుకుంటూ ఉండడం జరుగుతుంది

వీరు కూడా యథావిధిగా
“జనన – మరణ చక్రం ” లో చేరి పాఠాలన్నీ నేర్చుకోవలసిందే
ఎవరి స్వేచ్ఛ ప్రకారం వారు విహరిస్తూ వుంటారు ..
విధిగా పురోగమిస్తూనే వుంటారు.

మనం పూర్ణాత్మలుగా మారిన తర్వాతే మన స్వంత
మానస పుత్రులను సృష్టించడం సాధ్యమవుతుంది

* ప్రతి పూర్ణాత్మా ఒకానొక ‘ బ్రహ్మ ‘
అందుకే మానసపుత్రులు ” బ్రహ్మ మానస పుత్రులు “