బుద్ధత్వం జయహో

 

“బుద్ధత్వం” అంటే “సత్యానుభవం యొక్క పరాకాష్ఠ”

“బుద్ధత్వం” అంటే “సత్యప్రాప్తి యొక్క పరాకాష్ఠ”

నిరంతర సత్యాన్వేషణ ద్వారానే “సత్యం” అన్నది ప్రాప్తిస్తుంది

నిత్యమైనదే “సత్యం” .. అనిత్యమైనదే “అసత్యం”

“భౌతిక జగత్తులో అన్నీ అనుక్షణం మారుతూ ఉంటాయి ” అన్న అవగాహనే … “సత్యం”

“దృశ్యమాన ప్రపంచం” ఎలాంటిదో .. ” ద్రష్టాప్రపంచం” కూడా అలాంటిదే

“చూడబడేది” మారుతూ ఉంటుంది .. “చూసేదీ” మారుతూ ఉంటుంది

ఒకప్పటి దృశ్యమాన ప్రపంచం ఇప్పుడు లేదు

ఇప్పటి దృశ్యమాన ప్రపంచం రేపు ఉండదు

ఒక్కప్పటి ద్రష్టలైన మనం .. ఇప్పటి ద్రష్టలం కాదు

ఇప్పటి మనం .. రేపటి మనం కాజాలం

చూసేవీ .. చూడబడేవీ .. అన్నీ అనుక్షణం, అనునిత్యం మార్పు చెందేవే

ఇంత ఇలా ఉన్నా కూడా బుద్ధత్వం అన్నది “తటస్థ ప్రక్రియ” ఎంత మాత్రం కాదు!

“బుద్ధత్వం” అంటే ఆశలు లేని జీవితం ఎంత మాత్రం కాదు!

“బుద్ధత్వం” అంటే కోరికలు లేని స్థితి కాదు!

“బుద్ధత్వం” అంటే సరియైన కోరికలను లోకకల్యాణార్థం నెరవేర్చుకునేందుకు

నిరంతరంగా, ఆనందకరంగా చేసే మహా కృషి

“బుద్ధత్వం” అంటే సరియైన కోరికలను లోకకల్యాణార్థం నెరవేర్చుకునేందుకు

నిరంతరంగా, ఆనందకరంగా చేసే మహా కృషి

“బుద్ధత్వం” అన్నది అందరికీ యదార్థ అవగాహనను అందించే అద్భుతమైన ఆనందకరమైన స్థితి

“బుద్ధత్వం” అంటే సకల ప్రాణకోటి యొక్క యోగక్షేమాల కోసం తనను తాను అర్పితం చేసుకునే స్థితి

“బుద్ధత్వం” అంటే నాలుగు “బ్రహ్మవిహారాల” తో పరిపూర్ణమై, పరిపుష్ఠమై ఉండడం

మైత్రి, ముదితం, కరుణ మరి ఉపేక్షలతో కూడి వున్నవే బ్రహ్మవిహారాలు

ప్రతి మానవ ఆత్మ యొక్క ధ్యేయం బుద్ధత్వాన్ని చేరడం

“బుద్ధత్వం” అంటే స్వయంగా విశేషమైన దుఃఖరాహిత్య స్థితిలో ఉండడం

అలా ఉంటూ సకల మానవజాతిని కూడా ఆ దిశగా మళ్ళించడానికి చేసే మహాకృషిస్థితి

“బుద్ధత్వం” అంటే నిర్వాణ స్థితి .. పరినిర్వాణ స్థితి .. మహాపరినిర్వాణ స్థితి

“నిర్వాణం” అంటే దుఃఖరాహిత్య స్థితి .. అంటే ఒకానొక “అరిహంత్” యొక్క స్థితి

“పరినిర్వాణం” అంటే అది ఒక మహామహా దుఃఖరాహిత్య స్థితి .. ఒకానొక “బోధిసత్వుని” యొక్క స్థితి

“మహాపరినిర్వాణం” అంటే అది ఒక మహా మహా దుఃఖరాహిత్య స్థితి .. ఒకానొక “బుద్ధుని” యొక్కస్థితి

గౌతమ బుద్ధుడు “ఆది బుద్ధుడూ” కాదు.. “అంత్య బుద్ధుడూ” కాదు

పిరమిడ్ మాస్టర్లందరూ “మహామహాబుద్ధుళ్ళు”

బుద్ధత్వం జయహో! బుద్ధుళ్ళందరూ జయ జయహో!

పిరమిడ్ మాస్టర్లందరూ జయ జయ జయహో!

బుద్ధుళ్ళు అయిన వారందరికీ .. బుద్ధుళ్ళుగా కాబోయే వారందరికీ

“బుద్ధపౌర్ణిమ” సందర్భంగా .. శుభాకాంక్షలు !!!