అయం లోకో నాస్తి పరః

 

“న సాంపరాయః ప్రతిభాతి బాలం

ప్రమాద్యంతం విత్తమో హేన మూఢమ్;

అయం లోకో నాస్తి పర ఇతిమానీ

పునః పునర్వశమాపద్యతే మే”

= కఠోపనిషత్తు (2-6)

సాంపరాయః = ఉత్తమ గతులు
విత్తమోహేన = ధన మదం చేత
మూఢమ్ = సమ్మోహితులైన వారికీ
ప్రమాద్యంతమ్ = జాగ్రత్త లేని వారికీ
బాలమ్ = బాలునికీ (వివేకం లేని వారికీ)
న ప్రతిభాతి = కనిపించనే కనిపించవు
అయమ్ లోకః = ఈ లోకం ; (అస్తి = ఉన్నది)
పరః = పరలోకం ; (న అస్తి = లేదు) ;
ఇతి = అని;
మానీ = భావించేవాడు;
పునః పునః = మళ్ళీ మళ్ళీ;
మే = నా యొక్క (మృత్యువు యొక్క)
వశమ్ = అధీనంలో;
ఆపద్యతే = పడిపోతాడు
  • “జాగ్రత్త లేని బాలుడికీ .. ధనమదంతో మతిపోయినవానికీ . . శ్రేయోమార్గం ఎన్నటికీ కన్పించదు; ఉన్నది ఈ లోకమే, మరో లోకం లేనే లేదుఅనుకునేవాడు మళ్ళీ మళ్ళీ నా (మృత్యువు) చేతిలో పడుతూ ఉంటాడు”  (అని యముడు నచికేతునితో కఠోపనిషత్ లో అంటాడు)

= రామకృష్ణ మిషన్ ప్రచురణ