ఆత్మా దృశ్యతే సూక్ష్మదర్శిభిః

 

 

“ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే

దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః”

= కఠోపనిషత్(3-12)

సర్వేషు = అన్ని
భూతేషు = జీవులలో
గూఢః = దాగివున్న
ఏషః =
ఆత్మా = ఆత్మ
నప్రకాశతే = ప్రకాశించదు (అందరికీ)
సూక్ష్మదర్శిభిః = సూక్ష్మవిషయాలను దర్శించగలిగే ఋషుల చేత
అగ్ర్యయా = తీక్షణమైనఏకాగ్రమైన
బుద్ధ్యా = బుద్ధిచేత; (ఏషః ఆత్మా = ఈ ఆత్మ)
తు = కానీ
దృశ్యతే = సాక్షాత్కరింపబడుతుంది
  •  
  • “అన్ని జీవులలోనూ గుప్తమైవున్న ఈ ఆత్మ అందరికీ ప్రకటితం కాదు; సూక్ష్మదర్శులైన ఋషులు మాత్రమే తీక్షణమైన, ఏకాగ్రమైన తమ బుద్ధి ద్వారా ఈ ఆత్మను సాక్షాత్కరించుకోగలరు”

(=రామకృష్ణ మిషన్ ప్రచురణ)