ఆత్మ = అసంతృప్తి+సాహసం = సంతృప్తి
ఆత్మ యొక్క మౌలిక లక్షణం .. “అసంతృప్తి”
అందుకే ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవడానికి
సంతృప్తి కోసం ఆత్మ ఎప్పుడూ ..
సాహసాలకు ఉద్యమిస్తూ ఉంటుంది
ఆత్మ = అసంతృప్తి + సాహసం = సంతృప్తి
ఒకానొక భౌతిక శరీరాన్ని ధరించి ..
అది కూడా మానవ శరీరాన్ని ధరించి ..
భూలోకానికి ప్రయాణం కట్టడం
ఆత్మ చేసే ఒకానొక అంతిమ సాహసం!
ఆ సాహసయాత్రలో అన్ని రకాల అనుభవాలను
ఉద్వేగపూర్వకంగా అనుభూతి చెందుతూ
మరిన్ని భూలోకయాత్రలకు పూనుకోవడం
ఆత్మ చేపట్టే మరింత గొప్ప సాహసం!!
ఆ సాహసయాత్రల వల్లనే ఆత్మ సంతృప్తి చెంది.
పూర్ణాత్మగా మారి .. కారణలోకాలకు
మరి మహాకారణలోకాలకు ప్రయాణమై వెళ్తుంది!!
ఇలా ఆత్మ ఎప్పుడూ సాహసాలకు ఉద్యమిస్తూనే ఉంటుంది!!