ఆత్మ

 

“ఆత్మ యొక్క అనంత ప్రయాణం”
“ఆత్మ యొక్క అనంతమైన చిద్విలాస ప్రయాణం”

***
“ప్రకృతితో కలయిక” అంటే ఒకానొక “జీవాత్మ”యొక్క అవతరణ
“ప్రకృతితో కలయిక” అంటే ఒకానొక “జీవాత్మ” యొక్క ఆగమనం
“ప్రకృతితో విడిపోవడం” అంటే ఒకానొక “జీవాత్మ” యొక్క నిష్క్రమణం
“శరీరం యొక్క మరణం” అంటే “ఆత్మ యొక్క విడుదల”

***
“మానవాత్మ” యొక్క జీవితం నవరసభరితం!
ఆకలి, దప్పులు, ప్రాణభీతి, అలసట, కామం .. ఇవి అన్నీ జీవాత్మలకూ సర్వసాధారణం అయితే
వాటితో పాటు ఆందోళన, అసూయ, రాగం, ద్వేషం, స్వార్థం, మోహం, మదం ..
అన్నవి మాత్రం “మానవాత్మ” లకు ప్రత్యేకం!
ఆత్మవైపు నుంచి చూస్తే ఈ శరీరవత్ ప్రయాణం అన్నదంతా 
ఒక మహా చిద్విలాసం అయిన విషయం!
“శరీరప్రకృతిలో ఆత్మ యొక్క ప్రవేశం” అన్నది జీవరాశులన్నింటినీ మరింత, మరింత శక్తివంతం
మరి ఉద్దీపనం చేసే ఒక విశేషమైన చర్య!
మనమంతా మౌలికంగా, శాశ్వతమైన ఆత్మలం!
మరి అప్పుడప్పుడూ మాత్రమే జీవాత్మలం .. మానవాత్మలం!
ప్రతి మానవ జన్మ కూడానూ స్వీయ ఆత్మకు ఎంతో ప్రగతినీ, మరి సంతోషాన్నీ కలిగిస్తుంది
“మానవాత్మ” ఇతర జీవాత్మలను క్షేమంగా చూసుకోవడమే తన గొప్ప కర్తవ్యంగా కలిగివుంది ..
అంటే జంతుసామ్రాజ్యంలోని సకల జీవాత్మలకు సంరక్షణ కలిగించి
జంతువులనూ, పక్షులనూ, మత్స్యజాతినీ భక్షించకుండా వాటి పురోగతిని చూసుకోవడం!
అంతేగాక
“మానవాత్మ”గా ఖనిజసామ్రాజ్యానికీ, మరి వృక్షసామ్రాజ్యానికీ కూడా
తన ఆత్మశక్తి ని ప్రసరింపజేయడమే మరొక ముఖ్య కర్తవ్యం
ఇంకా విశేషంగా
తన “స్వంత మానవ శరీరం” లోని కోటానుకోట్ల కణాలనూ, కణజాలాలనూ,
కోటి కోట్ల సూక్ష్మజీవరాశులనూ తమ స్వీయ ఆత్మశక్తిలో
ఉన్నతి గావించడం అన్నది “మానవాత్మ” కు అన్నింటికంటే గొప్ప కర్తవ్యం!
ఇది తెలుసుకుని “ధ్యాన అభ్యాసం”లో ఉంటూ ఇతోధికమైన ఆత్మశక్తి ని పొందుతూ
మన శరీరాలలోని సకల కణాలనూ, మరి జీవరాశులనూ
ధ్యానం ద్వారా పొందిన ఆత్మశక్తిలో ముంచాలి!
ఈ శరీరంలో వుండే ప్రతి కణానికీ మనం “సాక్షాత్ దేవుళ్ళం” గదా!
ఈ విధంగా మన వంతు శరీర ధర్మాన్ని నెరపాలి!

***
“పిరమిడ్ మాస్టర్స్” అందరూ ఈ మూడు కర్తవ్యాలకూ కట్టుబడి ఉన్నవారు!
ఈ సౌర కుటుంబపు భూమండలంలో ఉన్న సకల మానవాళి
అంతా కూడా ఇక “పిరమిడ్ మాస్టర్లు”గా అవుదురు గాక!
పిరమిడ్ మాస్టర్లందరికీ శతకోటి ప్రణామాలు!!