ఆత్మరంజనార్థం ఆహారం

 

“ఆహారం” అన్నది కేవలం ఉదర పోషణార్థం కాదు

“ఆహారం” అన్నది అతిముఖ్యంగా “ఆత్మరంజనార్థం” కోసం కూడా

ఆహారంలోని పోషక పదార్థాలు ఉదర పోషణార్థం

అయితే,

ఆహారం లోని ‘రుచి’ అన్నది “ఆత్మరంజనార్థం” కోసం అన్నమాట

“ఏదైతే ఎక్కువగా ఆత్మరంజనమో .. అదే దేహ ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది”

అన్నది ప్రధాన ఆధ్యాత్మిక విజ్ఞాన సూత్రం

ఆత్మ సంతోషంగా, నిండుగా వుంటే..

ఆత్మకు ఛాయ అయిన దేహం కూడా ఆరోగ్యంగా, స్వస్థతగా, నిండుగా వుంటుంది

నోటిలోంచి బయటకు వచ్చే మాట ఎంత ముఖ్యమో నోటిలోకి పోయే ముద్ద కూడా అంతే ముఖ్యం

రుచి లేని వంటలు .. పచి లేని పాకాలు .. శృతి లేని సంగీతం .. లయ లేని గతులు

అందం లేని ఇళ్ళు .. చందం లేని వీధిలు .. ఇవన్నీ కూడా “ఆత్మ యొక్క దరిద్రత”కు సూచనలు

“ఆత్మ యొక్క దరిద్రత”ను దూరం చేయడమే “ఆధ్యాత్మికత”

ఆత్మజ్ఞానం వున్న వాళ్ళే వంటశాలలో ప్రవేశించాలి

ధ్యానం చేసినవాళ్ళే కూరగాయలు తరగాలి

పాకశాస్త్రపారంగతులే వంటలు వుండాలి

కనుక

ప్రతి ఒక్కరూ విధిగా ఆత్మజ్ఞానులుగా అయివుండాలి

ప్రతిఒక్కరూ విధిగా ధ్యానులు అయివుండాలి

ప్రతి ఒక్కరూ విధిగా పాకశాస్త్రాన్ని నేర్చుకోవాలి

ప్రతి ఒక్కరూ “నలభీమపాకం” లో శిక్షణ పొందాలి

“ఆధ్యాత్మిక జీవితం” అంటే వైరాగ్యం” కానేకాదు

“ఆధ్యాత్మిక జీవితం” అంటే “వైభోగం” అని గుర్తించాలి

జీవితం చాన్నాళ్ళ ముచ్చటగా మారాలి

“యుక్తాహారం” .. “మితాహారం” ..

“హితాహారం”

“పౌష్టికాహారం” .. “సాత్వికాహారం”..

“స్వస్థాహారం”

“స్వాదిష్టాహారం” .. “ప్రేయస్కర ఆహారం”

“నలభీమ పాక సదృశ ఆహారం”