ఆత్మజ్ఞాన ప్రభుత్వం

 

పూర్వకాలంలో రాజులకు రాజగురువులు ఉండేవారు.

దశరధుడికి వశిష్ఠుడు రాజగురువు.

పాండవులకు శ్రీ కృష్ణుడు రాజగురువు.

రాజగురువు లేని రాజ్య ప్రభుత్వం చుక్కాని లేని పడవ లాంటిది.

ఆధ్యాత్మిక లేని సామాజికత, ప్రాపంచికత, గమ్యం లేని గమనం వంటివి.

ఆత్మజ్ఞాన రహితమైన లోకజ్ఞానం ఎప్పటికైనా నిరాశనే, అసంతృప్తినే కలిగిస్తుంది.

కడుపు నిండా భోజనం, కంటినిండా నిద్ర, సకల వస్తు వాహానాల సముదాయం – ఇదే ఆదర్శాలయితే మానవుడి నిజప్రవృత్తి, శాశ్వతత్వం – అన్నవి మరుగున పడే ఉంటాయి. సమాజంలో అశాంతి, అనారోగ్యం, అసంతృప్తి అన్నవి శాశ్వత నిలయాలై ఉంటాయి.

మనకు కావలసింది రామరాజ్యం మరి శ్రీ కృష్ణ రాజ్యం.

రాముడిలాగా, శ్రీ కృష్ణుడిలాగా మనం కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులమైతేనే,

రామరాజ్యం, శ్రీ కృష్ణరాజ్యం అన్నవి నెలకొనేవి.

వశిష్ఠుల వారి దగ్గర ధ్యానాభ్యాసం, జ్ఞానాభ్యాసం చేస్తేనే దశరధుడి ప్రథమపుత్రుడు శ్రీ రామచంద్ర ప్రభువు అయ్యాడు.

సాందీపుడి దగ్గర ధ్యానాభ్యాసం,జ్ఞానాభ్యాసం చేస్తేనే దేవకీ నందనుడు శ్రీ కృష్ణ భగవానుడు అయ్యాడు.

ఇక ఆంధ్రరాష్ట్రంలో కూడా రామరాజ్యం, శ్రీ కృష్ణరాజ్యం వచ్చి తీరాలి.

ఆత్మజ్ఞానం కలవారైనా ప్రభుత్వం చేపట్టాలి; లేదా ప్రభుత్వంలో ఉన్నవారైనా ఆత్మజ్ఞానంను విధిగా సమీకరించుకోవాలి, సంపాదించుకోవాలి.

ధ్యాన భాగ్యం లేనిదే, ఆత్మజ్ఞాన సౌభాగ్యం లేనిదే ధర్మయుత ప్రభుత్వం అన్నది – భాగ్యయుత ప్రభుత్వం – అన్నది అసంభవం.

మనమందరం కలిసి ఆత్మజ్ఞాన ప్రభుత్వం కోసం కృషి చేద్దాం.

సోక్రటీస్ కన్న కలలను సార్ధకం చేద్దాం.

నూతన ప్రపంచం సృష్టికి నాంది పలుకుదాం.

సత్యయుగాన్ని స్థాపిద్దాం.

సత్యమేవ జయతే, అత్మయేవ జయతే.