ఆస్తికులలో నాలుగు వర్గాలు

 

ఆస్తికులలో నాలుగు వర్గాల వారున్నారు:

  1. మూడ భక్తులు
  2. శిష్యులు
  3. గురువులు
  4. పరమ గురువులు

మనిషి తన ఆత్మ పరిణామక్రమంలో
నాస్తికత్త్వం నుంచి ఆస్తికత్త్వంలోకి వచ్చిన తరువాత,
మూడభక్తిలో మొదట ‘పరవశుడు’ అవుటూ వుంటాడు;
“పరమవశుడు” అంటే “పరులకు వశుడు అయినవాడు” అని అర్థం

కానీ,
తరువాత
“ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి” . .
అనే పరమ సూత్రాన్ని
క్రమక్రమంగా తెలుసుకుంటూ
తీవ్రసాధనల ద్వారా అష్టసిద్ధులనూ స్వాధీనం చేసుకుంటూ
పరమగురువు స్థాయి కి చేరుతాడు
ఆ స్థాయి కి చేరుకున్న వాళ్ళనే సామాన్య ఆస్తికులూ,
వారి భక్తులూ, అయినవాళ్ళూ “దేవుడు” అని అంటున్నారు

  • దివ్యత్వం సాధించిన మానవుడే ‘దేవుడు’;
    ‘దివ్యుడు’ అనే పదానికి వికృతే ‘దేవుడు’ అనే పదం
  • పరమ గురువులే ‘దేవుళ్ళు’