అష్టాంగ మార్గం
బుద్ధుడు
మనకు ఇచ్చిన “అష్టాంగ మార్గం”
ఎనిమిది అంగాలు కలిగిన మార్గం
ఇది
సమ్మా దిట్ఠి | … | సరియైన దృక్పథాలు |
సమ్మా సంకప్పో | … | సరియైన సంకల్పాలు |
సమ్మా వాచా | … | సరియైన వాక్కు |
సమ్మా కమ్మంతో | … | సరియైన కర్మ |
సమ్మా జీవో | … | సరియైన జీవనోపాయం |
సమ్మా వాయామో | … | సరియైన శ్రద్ధ |
సమ్మా సతి | … | సరియైన ఏకాగ్రత |
సమ్మా సమాధి | … | సరియైన ధ్యానం |
అష్టాంగమార్గ అనుష్టానం వలన అవిద్య మాయమవుతుంది
అవిద్య దూరమవడం వలన తృష్ణ పోతుంది
తద్వారా శాశ్వత దుఃఖ నిర్మూలనం జరుగుతుంది.
అష్టాంగ మార్గంలో “ప్రజ్ఞ” , “శీలం” , “సమాధి” అన్న మూడింటి మౌలిక
విషయాలకు సంబంధించిన శిక్షణ చూపబడింది
- ప్రజ్ఞ = సరియైన దృక్పథాలు . . సరియైన సంకల్పాలు (కోరికలు)
- శీలం = సరియైన వాక్కు . . సరియైన జీవనోపాయం . . సరియైన కర్మ(నడవడిక)
- సమాధి = సరియైన శ్రద్ధ . . సరియైన ఏకాగ్రత . . సరియైన ధ్యానం