అప్పోదీపోభవ

 

బుద్ధుడు
తన జీవితంలో చివరిగా
తన ప్రియతమ అనుచరుడు,
మరి శిష్యుడు అయిన ఆనందుడికి ఇచ్చిన సందేశం ఇది:

“ఓ ఆనందా ! నీకు నువ్వే దిక్కువి కా !
ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడవద్దు
నీ ముక్తిని నువ్వే శ్రద్ధతో సంపాదించుకో !”

“అప్పో దీపో భవ” అంటే
“నీకు నువ్వే దిక్కువి కా” అని
అంటే
“Be A Light Unto Yourself “
అని
అప్పో = నీకు నువ్వే
దీపో = దీపమువి, దిక్కువి
భవ = అవు

“నీకు నువ్వే దిక్కువి కా” అన్నదే పరమసత్యం
“తులసీదళ” పాఠకులందరకూ ఇదే ప్రథమ, 
మరి అంతిమ సందేశం