అనుభవమే జ్ఞానం

 

సహనంగా మనం సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి. లోపల శక్తి సంచారం జరుగుతుంది. శక్తిక్షేత్రం ఉత్తేజితం అవుతుంది. మూడోకన్నులో కొన్ని కొన్ని రంగులు కనబడతాయి, చెట్లు కనబడతాయి, గుడులు కనబడతాయి గెడ్డం గాళ్ళు కనబడతారు. ఎవరెవరో చనిపోయిన వాళ్ళంతా కనబడుతూంటారు. వాళ్ళు ఫస్టు ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. మనకి వినపడదు. వాళ్ళు మాట్లాడుతూంటారు గానీ మనకు వినపడదు. ఎందుకంటే మన దగ్గర తగిన శక్తి ఉండదు. తరువాత మెల్లిమెల్లిగా వినపడటం మొదలవుతుంది. తరువాత సూక్ష్మ శరీరంతో మనల్ని వాళ్ళు అన్ని లోకాలూ తిప్పుతారు. మన జన్మలన్నీ చూపిస్తారు. వీటినే అనుభవం అన్నాం. ఈ “అనుభవమే జ్ఞానం”