“అనుభవాలను విశ్లేషించబూనడం అశాస్త్రీయం”

 

ఈ విశాల విశ్వంలో  బహుముఖ తలాలకూ మరి అనంతకోటి తలాలకూ చెందిన కోటానుకోట్ల అంశాల కలగలుపే మనం పొందే అనుభవాల సమాహారం కనుక .. మన స్వంత జీవిత అనుభవాలను కానీ .. ఇతరుల జీవిత అనుభవాలను కానీ మనం ఎంతమాత్రం విశ్లేషణలు చేయగూడదు! మనం కలల అనుభవాలను కానీ .. ఇతరుల కలల అనుభవాలను కానీ మనం ఎంత మాత్రం విశ్లేషణలు చేయకూడదు! మన ధ్యాన అనుభవాలను కానీ .. ఇతరుల ధ్యాన అనుభవాలను కానీ మనం ఎంత మాత్రం విశ్లేషణలు చేయగూడదు! వాటిని ప్రశ్నించకుండా, వక్రీకరించకుండా యధాతధంగా ఆమోదించాలి! లెక్కలేనన్ని గతాల యొక్క జ్ఞాపకాలు మరి లెక్కలేనన్ని భవిష్యత్తుల యొక్క సంభావ్యతల విశిష్ట కలయికలే మన వర్తమాన అనుభవాలు కనుక వర్తమాన అనుభవాలను విశ్లేషించగలిగే కొలమానం మన చైతన్యానికి గానీ, మన దివ్యదృష్టికి గానీ లేదు అందుకే అనుభవాలను విశ్లేషించబూనడం .. శాస్త్రపరంగా అసంభవం .. మరి ఆధ్యాత్మికపరంగా అశాస్త్రీయం!

“Judge Ye Not ” అన్నారు జీసస్ క్రైస్ట్ “Analyze Ye Not” అంటోంది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ “వీరు ఇలా” .. “వారు అలా” అని తీర్పులు చెప్పబూనడం దుస్సాహసం “ఇది ఇలా” .. “అది అలా” అని విశ్లేషణలు చెయ్యబూనడం మూర్ఖత్వం ప్రతి అనుభవంతోనూ తప్పనిసరిగా ఆత్మ ప్రభావితం అవుతుంది ప్రతి అనుభవంతోనూ విధిగా ఆత్మ ప్రశిక్షణను పొందుతుంది ప్రతి అనుభవంతోనూ ఆత్మ పరిణితి చెందుతుంది ప్రతి అనుభవంతోనూ మరి ఆత్మ మరింత తెలివిని పొందుతుంది కాబట్టి .. ప్రతి ఒక్క జీవిత అనుభవాన్ని కూడా స్వాగతించాలి ప్రతి ఒక్క స్వప్న అనుభవం పట్ల కృతజ్ఞులుగా ఉండాలి ప్రతి ఒక్క ధ్యాన అనుభవం నుంచి జ్ఞాన సంపదను పొందాలి మరిన్ని మరిన్నిగా అనుభవాలను పొందడానికి సదా సమాయత్తం కావాలి లేకపోతే మనం ఆత్మపరంగా బీదరికంలో మ్రగ్గాల్సి వస్తుంది

ప్రతిరోజూ నాకు కూడా కోకొల్లలుగా జీవిత అనుభవాలు వస్తూంటాయి కలల అనుభవాలు వస్తూంటాయి .. ధ్యాన అనుభవాలు వస్తూంటాయి ఇతరుల జీవిత అనుభవాలు కూడా నాకు తెలుస్తూ ఉంటాయి ఇతరుల కలల అనుభవాలు మరి వారి ధ్యాన అనుభవాలు అన్నీ కూడా నాకు తెలుస్తూ ఉంటాయి అయినా వాటిని ‘విశ్లేషణ’ చేస్తూ నేను నా శక్తిని పోగొట్టుకోను! నా శక్తిని నేను నా ముందస్తు అనుభవాలను పొందడం కోసం పొదుపుగా వాడుకుంటాను!

ప్రపంచంలో అందరికీ జీవిత అనుభవాలు విధిగా ఉంటయి కలల అనుభవాలు కూడా వస్తూనే ఉంటాయి కానీ .. ధ్యాన అనుభవాలే కొరవడుతున్నాయి! ధ్యానానుభవాలే మన జీవిత అనుభవాలకూ మరి మన కలల అనుభవాలకూ స్థిరత్వాన్ని ఇస్తాయి కనుక అందరం ధ్యాన అభ్యాసం అన్నదానిని ఇతోధికంగా చేద్దాం .. కోకొల్లలుగా ధ్యానానుభవాలను పొందుదాం జీవితంలో స్థిరత్వాన్ని పొందుదాం! జయహో ధ్యానం!!