అంతిమ ధ్యేయాలు
మనం “త్రికాల జ్ఞానులం” కావాలి
మనం “త్రిలోక సంచారులం” కావాలి
“ఈ మాంస పిండాన్ని మంత్రపిండం చేయాలి”
ఇవే,
ప్రతి వ్యక్తి జీవితం యొక్క అంతిమ ధ్యేయాలు;
ఇవన్నీ జన్మ పరంపరలో ధ్యానం ద్వారా సుసాధ్యాలు
ఏ జన్మలో ఈ అంతిమ ధ్యేయాలను
సాధించడానికి పూనుకుంటామో ..
ఆ జన్మ “ఆఖరి జన్మ” అయి తీరుతుంది
“యద్భావం తద్భవతి”
“యా మతిః సా గతిర్భవేత్”
అంటే,
“మన ‘మతి’ ఎలా వుంటుందో మన ‘గతి’ కూడా అలాగే వుంటుంది”
మన ‘మతి’ లోఈ ధ్యేయాలు పెట్టుకుని దీక్షతో సాధన కొనసాగిస్తే
మన ‘గతి’ కూడా తప్పకుండా అలాగే వుంటుంది
- అంతిమ ధ్యేయాలే లక్ష్యాలుగా పెట్టుకుందాం
- ఈ జన్మను ఆఖరు జన్మగా చేసుకుందాం