అంతర్ జీవితం
రెండు రకాల జీవితాలు ఉన్నాయి:
ఒకటి బాహ్య జీవితం.
రెండు అంతర్ జీవితం..
బాహ్య జీవితం గురించి నాకు అంతా తెలుసు అనుకుంటారు- అలాగే
అంతర్ జీవితం అనేది లేనే లేదు అని అనుకుంటారు.
అయితే, వాస్తవానికి అంతర్ జీవితమే బాహ్య జీవితానికి పరిపూర్ణతనిచ్చేది;
అంతర్ జీవితమే బాహ్యజీవితానికి పరిపుష్ఠిని ప్రసాదించేది.
అంతర్ జీవిత రహిత బాహ్య జీవితం ఇసుక పర్ర మీద కట్టిన కట్టడం;
అంతర్ జీవితం వినా బాహ్య జీవితం అన్నది గాలిలో మేడలు కట్టడం లాంటిది
అంతర్ జీవిత సహిత బాహ్యజీవితం అన్నది పునాదుల మీద కట్టబడిన రాజసౌధం
అంతర్ జీవితమే బాహ్య జీవితాన్ని పూర్తిగా సువిదితం తెలియజేయగలిగేది.
అంతర్ జీవితం అన్నది ఆత్మజ్ఞానమయం – ఆత్మాను భవమయం.
బహిర్ జీవితం అందరికీ చూపించగలిగినది..
అంతర్ జీవితం అందరికీ చూపించలేనిది..
అంతరంగ జీవితం ద్వారా బహిరంగ జీవితం అర్థవంత మవుతుంది.
తేజోవంతమౌతుంది; ధర్మార్థ కామమోక్షదాయకం అవుతుంది.
అంతర్ జీవితం అన్నది సజ్జన సాంగత్యం ద్వారా మొట్టమొదటి సారిగా
పరిచయం అవుతుంది.
తర్వాత నిరంతర ధ్యాన, స్వాధ్యాయాల అభ్యాసాల ద్వారా సుశిక్షతమౌతుంది