అంతా సత్యమే
అనాదిగా “చార్వాక సిద్ధాంతం”
అదే ఇప్పటి కమ్యూనిస్టువారి “నాస్తిక పరిభాష”.. మరి “హేతు వాదం”..
“జగత్ సత్యం..బ్రహ్మ మిధ్య..జీవో జగదైవ నా పరః” అంటోంది
అంటే “ఈ కంటికి కనపడే జగత్తే సత్యం..
ఈ చర్మచక్షువులకు కనపడనిది ఇంకా ఏదో ఉంది అనుకోవడం భ్రమ..
‘జీవుడు ’ అంటే ఈ కంటికి కనపడే భౌతిక శరీరమే కానీ.. అంతకంటే ఏమీ కాదు;
చనిపోయిన తర్వాత శరీరం నుంచి విడివడే ‘ఆత్మ పదార్థం’ ఏదీ లేదు” అన్నది వారి భావన
అయితే దీనికి భిన్నంగా ఆస్తికవాదులు అనాదిగా నొక్కివక్కాణిస్తోన్న సూత్రం..
“జగత్ మిధ్య.. బ్రహ్మ సత్యం.. జీవో బ్రహ్మైవ నా పరః”
అంటే.. “ఈ కంటికి కనపడే జగత్తే ఏ అస్తిత్వం లేనిది..
కంటికి కనపడని అస్తిత్వమే నిజమైన చైతన్యం కలిగి ఉన్నది
‘జీవుడు’ అంటే కేవలం భౌతిక పదార్థం మాత్రమే కాదు..
‘జీవుడు’ అంటే ఆ బ్రహ్మమే.. మరి ఆ సృష్టివ్యాప్త ఆత్మపదార్థమే”
“భౌతికాయం చనిపోయిన తరువాత ఆత్మ అన్నది నిలిచే వుంటుంది” అన్నదే “ఆస్తిక పరిభాష”
దీనికి కూడా ప్రత్యామ్నాయంగా మరొక పరిభాష కూడా ఉంది మరి అదే “భౌద్ధిక పరిభాష”
బౌద్ధిక పరిభాష.. “జగత్ శూన్యం.. బ్రహ్మ శూన్యం.. జీవో శూన్యైవ నా పరః” అంటోంది
అంటే.. “ఈ జగత్తు అంతా శూన్యమే.. బ్రహ్మ కూడా శూన్యమే
మరి అందులోవున్న ‘జీవుడు’ కూడా మహాశూన్యమే.. అంతేకానీ.. వేరు ఏదీ కాదు” అని
ఈ మూడు భిన్న విభిన్న దృక్పధాలు ఎన్నో రకాలుగా ఎంతోమందికి ఉపయోగపడ్డాయి..
ఎంతోమందిని శాంతపరచాయి.. మరెంతో మందిని కల్లోలపరచాయి కూడా
అయితే.. అసలు సిసలైన “పిరమిడ్ సిద్ధాంతం” మాత్రం
“జగత్ సత్యం .. బ్రహ్మ సత్యం.. జీవో ద్వయమపి నా పరః” అంటోంది
అంటే.. “శరీరంతో పాటు ఈ కంటికి కనపడే జగత్తు,
కంటికి కనపడని చైతన్యం మరి అనేకానేక లోకలు సత్యమే..
అసలు ఈ ‘జీవుడు’.. ఏక కాలంలో..రెండూనూ”
జై పిరమిడ్ సిద్ధాంతం! జై పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్మెంట్!!