అన్నపూర్ణ – ధ్యానపూర్ణ

 

ఆంధ్రరాష్ట్రం భారతదేశానికి అన్నపూర్ణ.

– మన రాష్ట్రంలోనే ప్రత్యేకమైన అన్నపూర్ణ ప్రాంతాలు కృష్ణ, గోదావరి డెల్టాలు.

అందులోనూ డెల్టా అనగానే ప్రధానంగా గుర్తు వచ్చేది తెనాలి.

ఎప్పుడూ కళకళ లాడే ప్రాంతం.

సమృద్ధిగా పంటలు పండించుకుని, పుష్టిగా తిని కంటినిండా నిద్రపోయే ప్రజలు.

పాపం ఇదే జీవితం అనుకుంటున్నారు.

అయితే, అన్నీ ఉన్నా, ఏదో అసంతృప్తి, ఏదో వెలితి.

బహిరంగంగా ప్రకటించకపోయినా లోలోపల శూన్యతను అనుభవిస్తూనే ఉంటారు.

ఒక్కో రోజు నిద్ర వస్తుంది, ఒక్కో రోజు రాదు.

ఒక్కో రోజు సంతోషం ఉప్పెనలా పొంగుతుంది;

ఇంకో రోజు దుఃఖం వరదలా వస్తుంది.

కడుపు నిండుగా ఉన్నా గుండె మాత్రం ఖాళీయే. భక్తి మార్గం ఉంది కానీ ముక్తి మార్గం లేదు.

మాదే ముక్తి మార్గం, మాదే ముక్తి మార్గం –

అన్ని రకరకాలుగా, వివిధ మతాల ప్రబుద్ధుల ప్రలోభాలకు లోబడి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలను ఆచరించినా, ఎన్ని నోములు నోచినా, యజ్ఞయాగాదులు ప్రదక్షిణలు, జపాలు ఎన్నింటిని చేసినా ఫలితం మాత్రం మృగ్యం.

జీవితంలో ఏదీ పుష్పించలేదు. ఒక్కటి మాత్రం జరుగుతోంది…

జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలు ఆవిర్భవిస్తున్నాయి.

ప్రబుద్ధులు కాకుండా నిజమైన బుద్ధుళ్ళు రంగ ప్రవేశం చేస్తున్నారు.

అన్నపూర్ణ అయిన అంధ్రరాష్ట్రం ధ్యానపూర్ణగా మారిపోతుంది.

ధ్యానం వల్లనే జ్ఞానం – జ్ఞానం వల్లనే ముక్తి అని అందరూ తెలుసుకునే రోజులు వచ్చేశాయి.