అందరూ ‘నందనులు’ గా ఉందురుగాక

 

మనిషిని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి ?

సంవత్సరాన్ని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి ?

అన్ని పేర్లూ ఒక్కటే.

” రోజా పువ్వును ఏ పేరుతో పిలిచినా .. అది రోజా సువాసననే ఇస్తుంది ” ..

అన్నారు విలియం షేక్స్‌పియర్ మహాత్ములు

” What’s in a name ? That which we call a rose

By any other name would smell as sweet. “

-William Shakespeare

మారవలసినవి మన గుణగణాలు

“గుణం” అన్నది కర్మల మీద ఆధారపడి వుంటుంది

కర్మలు చేస్తూ చేస్తూ వుంటే .. “గుణం” అన్నది మెల్లిగా మారుతూ, మారూతూ వుంటుంది

“గుణం” అన్నది అంతరాత్మ యొక్క యదార్థస్థితి

“కర్మలు” అన్నవి బాహ్యప్రపంచంలో .. మరి ఇతర ప్రాణకోటితో .. మనం నెరపే వ్యవహారాలు

కర్మలు చేస్తూ చేస్తూ వుంటే .. గుణాలు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాయి

అలసత్వంలో, బద్ధకంలో, అకర్మలో మునిగితే “తమోగుణం”

అహంకారంలో, విచక్షణారాహిత్యకర్మల్లో మునిగి వుంటే “రజోగుణం”

గౌరవ ఆదరాలతో, వినయంతో .. పరస్పర హితకర కర్మల్లో .. మునిగితే “సత్వగుణం”

ఆత్మ యొక్క జన్మజన్మల సహజపరిణామక్రమంలో ..

తమోగుణం అన్నది తొలి మజిలీ .. రజోగుణం అన్నది రెండో మజిలీ .. సాత్విక గుణం మూడవ మజిలీ ..

“నిర్గుణం” అన్నది చివరాఖరి స్థితి ..

నీటిలో మునిగితే స్నానం .. శ్వాసలో మునిగితే ధ్యానం

ధ్యానానుభవాల ద్వారా ఆత్మసత్యంలో మునిగితే “జ్ఞానం” ..

అదే “నిర్గుణం” .. మరి అదే “నిర్వాణం”

నిర్గుణుడైనవాడు ఇక లోకకల్యాణ కార్యక్రమాలలో మునుగుతాడు

లోకకల్యాణంలో మునిగితే .. అదే “పరినిర్వాణం” .. అదే “మహాపరినిర్వాణం”

లోకకల్యాణ కార్యక్రమాల్లో మునిగితేనే ఏ ఆత్మకైనా నిజమైన ఆనందం, నిజమైన సంతోషం

“నందన నామ” సంవత్సరంలో అందరూ ” నందనం ” లో మునుగుదురుగాక

“నందనం” అంటే “సంతోషం” .. “నందనం” అంటే “ఆనందం”

అందరూ ‘నందనులు’ గా ఉందురుగాత.