అందరూ బుద్ధుళ్ళుగా కావాలి
శాకాహారమే తీసుకోవాలి. ప్రపంచంలో అన్నింటికన్నా దరిద్రమైనది మాంసం. మాంసాహారులందరూ మాంసాహారాన్ని వదిలిపెట్టి శాకాహారులు కావాలి. ప్రతి ప్రాణీ దైవాంశమే.
శాకాహార భోజనం, అదీ – మితంగా తీసుకోవాలి. నాలుగు ఇడ్లీల దగ్గర మూడు ఇడ్లీలు, మూడు ఇడ్లీల దగ్గర రెండు తినాలి. గాంధీజీ గారు వారానికి ఒకరోజు ఉపవాసం చేసేవారు. మనం కూడా ఉపవాసం అభ్యాసం చెయ్యాలి. రోజంతా పని చేసి చేసి రిలాక్స్ ఎలా అవ్వాలనుకుంటామో, సరిగ్గా మన భౌతికశరీరం కూడా అంతే. నేను ఒక సంవత్సరం కేవలం జ్యూస్‌లు మాత్రం త్రాగి వున్నాను.
చిన్నప్పటి నుంచి అందరూ పండితులు కావాలి. ‘ఉపనయనం’ అంటే మూడవకన్ను తెరుచుకోవడం. చిన్నవయ్యస్సులోనే అందరూ మూడవకన్ను తెరుచుకుని పై లోకాలను దర్శించాలి. పై లోకాలను దర్శించడమే ఉపనయనం. అప్పుడే క్రింద లోకాల్లో ఏడవకుండా ఆనందంగా వుండగలం. అప్పుడే మనం ‘Take It Easy’ అనగలం.
ఏడ్చేవారూ, టెన్షన్ ఫీల్ అయ్యేవారూ …. అందరూ అజ్ఞానులు. రాముడు పధ్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు… రాముడికి ఏదైనా టెన్షనా? బాధా? ఏడ్చాడా? లేదే. దశరధుడికే టెన్షన్, బాధ. జీసస్‌ను శిలువకేసి మేకులు కొట్టారు. ఆయన బాధ గానీ, టెన్షన్ గానీ పడ్డాడా? లేదే. మనం జీసస్, శ్రీకృష్ణలా కాకపోతే పామరులం. కనుక మనం ధ్యానులుగా అంటే పండితులుగా మారాలి
అందరూ బుద్ధుళ్ళుగా కావాలి.