ఆనాపానసతి

 

మనిషి తనను తాను మరిచిపోయాడు.

మనిషి తనను తాను పోగుట్టుకున్నాడు.

మనిషి తనకు తాను శూన్యమైపోయాడు.

ఫలితం?

పర్యవసానం?

ఫలితం – దుఃఖం.

పర్యవసానం – అర్ధరహితమైన జీవితం.

ఇదీ సగటు మానవుని రీతి, తీరు – ప్రపంచమంతటా.

ఇదే తీరు ప్రతి జిల్లా లోను, ప్రతి గ్రామం లోనూ, ప్రతి కుటుంబం లోనూ,

ఇలాగే, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ,

అయితే, ఇప్పుడు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వచ్చాయి: ఆంధ్రరాష్ట్రమంతటా వచ్చాయి: ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోనూ వెలుస్తున్నాయి.

ఇప్పుడు ఎవరిని వారు గుర్తు తెచ్చుకోవచ్చు.

ఎవరికి వారు స్వస్థతను రాబట్టుకోవచ్చు.

ఎలా? అంటే – ఆనాపానసతి ద్వారా.

అంతే, అంతే, అంతే…

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ యొక్క ధ్యానుల మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం అనాపానసతి ధ్యాన అభ్యాసం.

ప్రజలందరినీ ధ్యానులుగా, యోగులుగా, ఋషులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నాయి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్.

ఆనాపానసతి ధ్యానాభ్యాసం చేయండి.

అందరి చేతా చేయించండి.

ధ్యాన, జ్ఞాన ప్రచార యజ్ఞాలలో భాగస్వాములు కండి.

ధ్యానభాగ్యాన్ని పొందండి.

ఆత్మ సామ్రాజ్యాన్ని ఏలండి.

వాయుపుత్రులు కండి.

రామ మిత్రులు కండి.