అక్షరాభ్యాసం

 

“అ” + “క్షరం” = ” అక్షరం “

“క్షరం” కానిది “అక్షరం”

“క్షరం” అంటే “నశించేది”

“అక్షరం” అంటే “నశించనిది” అని అర్థం

“చైతన్యం” అంటే ” ‘నేను’ అనే ఆత్మపదార్థం”

“చైతన్యం” అన్నదే “అక్షరం” .. అంటే “నశించని వస్తువు”

“మనం చేతనామయ ఆత్మలం” – అన్న సత్యాన్ని

ఎప్పుడూ అభ్యాసంలో ఉంచుకోవడమే

“అక్షరాభ్యాసం” అన్నమాట

“అక్షరాభ్యాసం” అంటే “అక్షరాన్ని అభ్యాసం చేయడం”

“అక్షరాభ్యాసం” అంటే ” ‘నేను ఆత్మను’ అన్న సత్యాన్ని

దైనందిన భౌతిక జీవితంలో అభ్యాసం చేయటం”

  • ధ్యానం ద్వారానే మరి “అక్షరాభ్యాసం” అన్నది జరుగుతుంది
  • ధ్యానంలో జరిగే ఆత్మానుభవ కృషియే “అక్షరాభ్యాసం”
  • అక్షరాభ్యాసానికి ఆదిఉంది కానీ అంతంలేదు.
  • ఆధ్యాత్మికత” అంటే అనుక్షణ అక్షరాభ్యాసమే
  • ఎవరి సాధన వారిదే .. అక్షరాభ్యాస దివ్యక్షేత్రంలో