అజ్ఞుడు  అల్పజ్ఞుడు  విజ్ఞుడు

 

 

“అజ్ఞుడు”

అంటే, “అజ్ఞాని”

“బొత్తిగా జ్ఞానం లేనివాడు, ఏమీ తెలియనివాడు” అన్నమాట

“ఇహలోకమే సర్వం” అని భావించి,

కేవలం శారీరక వాంఛల తృప్తి కోసమే

సర్వశక్తి యుక్తులనూ ప్రయోగిస్తూ,

ఒకింత సుఖాన్నీ . . మరి కొండంత దుఃఖాన్నీ

అనుభవించేవాడే “అజ్ఞుడు”

“అల్పజ్ఞుడు”

అంటే, “అల్పజ్ఞాని”

పరలోకాలు వున్నాయని తెలుసుకున్నా, గ్రహించినా,

ఇహలోక విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ,

ఆధ్యాత్మిక ప్రగతికి ఇవ్వవలసినంత విలువను ఎంత మాత్రం ఇవ్వకుండా

సుఖదుఃఖాలను విభిన్న మోతాదులలో

“పగలు-రాత్రి” లాగా అనుభవించేవాడే “అల్పజ్ఞుడు”

“విజ్ఞుడు”

అంటే, “పూర్ణజ్ఞాని”

ఆధ్యాత్మికోన్నతికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ,

ఇహలోక విషయాలకు తగినంత మాత్రమే విలువనిచ్చేవాడు . .

స్వీయకల్యాణాన్ని లోకకల్యాణ కార్యక్రమంలో ఒక చిన్ని భాగంగా మాత్రమే భావించేవాడు

  • విజ్ఞుడే దుఃఖరహితమైన, అవిచ్ఛిన్నమైన ఆనందాన్నిసర్వదా అనుభవిస్తూ వుంటాడు
  • విజ్ఞులుగా అవడమే మనందరి లక్ష్యం