అదృష్టం
“దృష్టి” = “చూపు”
“ద్రష్ట” = “చూసేవాడు”
“దృష్టం” = “చూడబడేది”
“అ + దృష్టం” = “చూడబడనది”
“అదృష్టం” అంటే “చూడబడనిది” . .
అంతేకానీ “లేనిది” అని మాత్రం కాదు
కారణం కనబడితేనే “దృష్టం”
కారణం అగోచరమయితే “అదృష్టం”
కారణం గత జన్మలోనూ,
కార్యం ఈ జన్మలోనూ
ఉన్నప్పుడు ఇక అది సామాన్యులకు కనబడదు
అలాగే,
కారణం “శుభప్రదం” గా ఉన్నప్పుడు “అదృష్టం” అనీ
అది “అశుభప్రదం” గా ఉన్నప్పుడు “దురదృష్టం” అనీ అంటాం
- కారణం లేకుండా ఏ కార్యమూ ఎప్పుడూ ఉండదు
- ‘అదృష్టం‘ , ‘దురదృష్టం‘ అన్నది కారణ–కార్య సంబంధాలే