ఆధ్యాత్మిక శాస్త్రవేత్త – అనీబిసెంట్

 

అనీబిసెంట్. 19వ శతాబ్దాంతంలో, 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ భూమ్మీద జన్మించిన దివ్యమూర్తులలో అనీబిసెంట్ అత్యంత ప్రముఖురాలు.

ఈ భూమ్మీది ప్రజల ప్రేమ మరి పుణ్యభావంతో ఎల్లప్పుడూ గుర్తుంచుకునే విధంగా అనేక సంవత్సరాలు ఆమె థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షురాలిగా అద్భుతంగా పనిచేశారు.

ఆమె పాశ్చాత్య దేశీయురాలైనా భారతీయ భావలను భారతీయ సిద్ధాంతాలనూ పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. పరిపూర్ణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయి కూడా రాజకీయ ప్రజాసేవ పట్ల ఎలాంటి విముఖత చూపలేదు. ఆమె ఒక సంవత్సరం పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు.

ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆమె జీవిత చరిత్రనూ, ఆమె వ్రాసిన అద్భుత రచనలనూ తప్పక చదివి తీరాలి.

ఆధ్యాత్మికత అంటేనే అనీబిసెంట్. మరి ఆమె మాంసంలో, రక్తంలో, కండలలో, ఎముకలలో ఆధ్యాత్మిక శాస్త్రం అణువణువునా రూపుదిద్దుకున్నది.

అనీబిసెంట్‌గా తయారవ్వాలని ప్రతి పిరమిడ్ మాస్టర్ కలలు కనాలి.

ఓ మేడమ్, అనీబిసెంట్‌గా జీవించిన మీ దివ్య జీవితానికి సహస్రకోటివందనాలు.

మేము కూడా మీ అజెండానే పట్టుకున్న వాళ్ళం. మీ జ్ఞానపథాన్నే కొనసాగిస్తున్న వాళ్ళం.

పై లోకాల్లో మిమ్మల్ని కలుసుకుని మితిమీరి ఆనందించడానికి వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాం.

అంతవరకు … మేం కొనసాగిస్తాం … ఈ నిరంతర జ్ఞాన యజ్ఞం.