అధర్మయుక్తమైన కర్మలు?
ఒకవేళ గనుక,
అధర్మయుక్తమైన కర్మలైనా “చేయాలి” అని
విపరీతంగా అనిపిస్తే చేసేతీరుతాం
ఇది రజోగుణ సంబంధమైనది;
ఒకానొక వ్యక్తికి ఇది కూడా అవసరం కావచ్చు
ఇది కూడా తీర్చుకునే తీరాలి . .
అప్పుడే అభివృద్ధి . .
మరి అప్పుడే ముందుకు వెళతాం
అందుకే వేమన యోగి అన్నాడు;
“కామిగాక మోక్షగామి కాడు” అని
కోరికలు తీర్చుకోవడంలో ఉద్యుక్తుడైన వాడే “కామి”
- ‘ఆ కామి‘మొదట ‘కామి‘గా మారాలి
ఒకవేళ ‘దుష్కామి‘అయితే క్రమక్రమంగా
ఆ యా పాఠాలు నేర్చుకోవడం ద్వారా, అచిరకాలంలో,
‘సత్యకామి‘ గా అయితీరుతాడు