ABCD ల అర్జున కృష్ణతత్త్వం

 

 

ABCD ల అర్జున కృష్ణతత్త్వం

‘A‘ జ్ఞానాన్ని నేర్చుకోగానే అక్కడ ఆగిపోకూడదు. ‘B‘ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ‘A‘ ఆర్జునతత్త్వం … అంటే తెలుసుకున్నది. ‘B‘అంటే కృష్ణతత్త్వం … తెలుసుకోవలసింది. ABCD ల జ్ఞాన అర్జునతత్త్వం అయితే, ‘E‘ ని కృష్ణతత్త్వంగా గ్రహించాలి. అఘాత జ్ఞాన సాగరంలో నేర్చుకున్న జ్ఞానం నీటిబొట్టు … అంటే అర్జునతత్త్వం. నేర్చుకోవాల్సిన జ్ఞానం సాగరం … అంటే కృష్ణతత్త్వం … మనం నిరంతరం అర్జునతత్త్వం నుంచి కృష్ణతత్త్వం ప్రాప్తికి అకుంఠిత కృషి చేయాలి.

శివతత్త్వం

‘శివం’ అంటే శుభకరం. శుభాన్ని కలిగించేవాడు శివుడు. శివుడు సంగీతం (ఢమరుక చిహ్నం), నృత్యం, (తాండవభినయం), ధ్యానం (త్రినేత్రం)ల కలయిక. శరీరధారియైన ఏ ఆత్మైనా శివతత్త్వంతో తాదాత్మ్యం చెందాలంటే మొదట ఢమరుక నాదంతో అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన సంగీత గ్రాహియై, తాను గ్రహించిన ఆ సంగీతమృతాన్ని నృత్యహేలతో ఆనందపరవశియై తాండవం చేస్తూ జ్ఞాన సంగీతామృతాన్ని అందరికీ పంచి అమృతతుల్యుల్ని చేయాలి. తద్వారా నిశ్చలమైన జ్ఞాన స్థితిని పొందాలి. శివుని చేతిలోని అగ్ని నిప్పుతో చెలగాటమాడాలని (జీవితంలో ఎట్టి ఒడిదుడుకులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని), భిక్షాపాత్ర … ప్రతి ఒక్కరి దగ్గర భిక్ష ఎత్తాలని (ప్రతి ఒక్కరి నుంచి జ్ఞానం నేర్చుకోవాలని), కపాలం … శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.

దశావతారాలు

దశావతారాల నుంచి మానవుడు గ్రహించి ఆచరించవలసిన సత్యాల వివరణ.

మత్స్య నిత్య చైతన్య స్థితి
కూర్మ ప్రాపంచిక విషయాలతో అవసరముంటే కూడాలిలేదంటే ముడుచుకోవాలి.
వరాహం భూ భారాన్ని మోయాలి. అంటే భూలోకంలోని అజ్ఞాన భారాన్ని
నృసింహ సమాజంలోని చెడును చీల్చి చెండాడాలి.
వామన ఒకపాదంభూమి మీద రెండోపాదం ఆకాశం మీదఅంటే స్థూల శరీరంతో భూమి మీద ఉంటూ ధ్యానంతో సూక్ష్మశరీరయానం సాగుస్తూ ఊర్ధ్వలోకాలు దర్శించాలి.
పరుశురామ ఒక లక్ష్యం కోసం పోరాడియైనా జయించాలి.
రామ కుటుంబ విషయాలని బాధ్యాతతో చూసుకోవాలి.
బలరామ కష్టపడి ఎవరి సంపాదన వారు సంపాదించుకోవాలి.
కృష్ణ ఎప్పుడూ మెలకువగా వుండాలి.
బుద్ధ ధ్యానంతో బుద్ధుడవ్వాలి.

ఐదువ్రేళ్ళ కథ

  • చిటికెన వ్రేలు – శరీరం (కుంభకర్ణాయణం)
  • ఉంగరం వ్రేలు – మనస్సు (రావణాయణం)
  • మధ్య వ్రేలు – బుద్ధి (విభీషణాయణం)
  • చూపుడు వ్రేలు – జీవుడు/ప్రాణశక్తి (సీతాయణం)
  • బొటన వ్రేలు – ఆత్మ/మూలచైతన్యం (రామాయణం)

జీవుడు (4), శరీరం, మనస్సు, బుద్ధి (1,2,3) ని వదిలి ఆత్మతో లయమయ్యే విధానాన్ని (హనుమాయణం) అంటాం. అంటే ‘ఆనాపానసతి’. జీవుడు (4) ఆత్మను (5) ను చేరడమే ఆత్మాయణం. అప్పుడే విజయం చేకూరుతుంది. బొటనవ్రేలు విజయానికి సూచికం. ఈ అన్నిటి కలయికే “వాల్మీకాయణం”.

ఆత్మాయణం

మరణానంతరం తన కర్మ ఫలితాన్ని బట్టి ఆత్మ, భువర్‌లోకం, సువర్‌లోకం, కారణలోకం, మహాకారణలోకానికి వెళ్తుందని, ధ్యానం వలన తను ఆత్మ అని తెలుసుకున్న ఆత్మ భూలోకంలో జన్మించి తన దగ్గరకి వచ్చిన ఆత్మలకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి తత్ఫలితంగా తపోలోకానికి చేరుతుంది. తిరిగి జన్మించి తనే ఎన్నో ఆత్మల దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి బుద్ధుడై శరీరం త్యజించి సత్యలోకానికి పరిపూర్ణ ఆత్మగా చేరి తనే అంశాత్మలని సృష్టిస్తుంది.