“ఆసక్తి – ధ్యాస”
“ధ్యాస” అంటే “శ్రద్ధ” .. “గురి” “ధ్యాస” అంటే “ఒకానొక ప్రత్యేక మూసలో ఉన్న ఆలోచనా స్రవంతి” “ధ్యాస” అంటే “చిత్తవృత్తులన్నింటినీ ఒకే లక్ష్యార్థం ఏకోన్ముఖం చేయడం” “దేనిపట్ల మనకు ధ్యాస ఉంటుందో దానితో కూడి ఉంటాం” అని చెప్పింది భగవద్గీత “ధ్యాయతో విషయాన్ పూంసః సంగస్తేషూజాయతే” *** “పర ధ్యాస” అన్నది ఎంతటి సహజ మానవ స్వభావమో “ధ్యాస” అన్నది కూడా మనిషి యొక్క అంతే సహజ స్వభావం బాల్యదశలో .. “క్రీడాసక్తః” అంటే “ఆటల మీద ధ్యాస – ఆసక్తి” తరుణ వయస్సులో .. “తరుణీసక్తః” అంటే “స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణల పట్ల ధ్యాస – ఆసక్తి” వృద్ధావస్థలో .. “చింతాసక్తః” అంటే “లెక్కలేనన్ని శారీరక, మానసిక, కుటుంబ మరి సామాజిక సమస్యలపట్ల ధ్యాస” అయితే “పరసే బ్రహ్మణి కోపినసక్తః” “మరి ఏ స్థితిలో కూడా బ్రహ్మజ్ఞానం పట్ల ఎవ్వరికీ ధ్యాస లేదు” అని వాపోతున్నారు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు “ఆదిశంకరాచార్యులు”, “రాముడు”, “కృష్ణుడు”, “ఏసుప్రభువు”, “రమణమహర్షి” వంటి యోగీశ్వరులు అందరూ లేతవయస్సునుంచే ఆత్మజ్ఞానంపట్ల మరి ఆత్మాభివృద్ధిపట్ల తమ తమ తీవ్ర ఆలోచనా స్రవంతులను ప్రసరించారు వారు మనందరికీ ఆదర్శమూర్తులయ్యారు “శ్రద్ధవాన్ లభతే జ్ఞానం” అని చెప్పింది భగవద్గీత “సాధనాపరాయణులయిన .. మరి శ్రద్ధాళువులు అయిన .. వారికే తత్త్వజ్ఞానం లభిస్తుంది” అని అర్థం *** ఆటల మీద “ఆసక్తి – ధ్యాస” ఉంటే “P.V. సింధు” అవుతాం పాటల మీద “ఆసక్తి – ధ్యాస” ఉంటే “లతా మంగేష్కర్” అవుతాం సంగీత మీద “ఆసక్తి – ధ్యాస” ఉంటే “పండిట్ రవిశంకర్” అవుతాం సాహిత్యం మీద “ఆసక్తి – ధ్యాస” ఉంటే “విలియమ్ షేక్‌స్పియర్” అవుతాం నృత్యం మీద “ఆసక్తి – ధ్యాస” ఉంటే “పండిట్ బిర్జూ” అవుతాం లోకకల్యాణం పట్ల “ఆసక్తి – ధ్యాస” ఉంటే “మహాత్మాగాంధీ” అవుతాం శ్వాస మీద “ఆసక్తి – ధ్యాస” ఉంటే “ధ్యానులం” అవుతాం దుఃఖరాహిత్యం పట్ల “ఆసక్తి – ధ్యాస” ఉంటే .. “బుద్ధుళ్ళం” అవుతాం ఆత్మానుభవం పట్ల “ఆసక్తి – ధ్యాస” ఉంటే .. “సిద్ధపురుషులం” అవుతాం ఇలా .. మన “తీవ్రతరమైన ఆసక్తి – ధ్యాస” అన్నది ఏ క్షేత్రంలో అయితే ఉంటుందో ఆ క్షేత్రంలో మనకు సహజంగానే సిద్ధత్వం, సమర్థత్వం ప్రాప్తిస్తాయి *** ఆధునిక నవ్యయుగ “బుద్ధుళ్ళు” అయిన గ్రేట్ పిరమిడ్ మాస్టర్లందరికీ వందనాలు మన “శ్వాస మీద ధ్యాస”ను మరింత పటిష్టం చేద్దాం మన “ధ్యాస”ను లోకకల్యాణంవైపు మరింత కేంద్రీకరిద్దాం మన “ధ్యాస”ను ఆత్మానుభవం కోసం మరింత ఉపయోగిద్దాం “శ్వాస మీద ధ్యాస” జయహో! “బుద్ధత్వ ప్రాప్తి” / “సిద్ధత్వప్రాప్తి” జయ జయహో||