ఆహారం – వ్యవహారం
“దేహం” అన్నది వేరే
“దేహి” అన్నది వేరే
అన్నం, నీరు, రొట్టె మొదలయినవన్నీ
మన “దేహానికి” ఆహారం మాత్రమే
అంతేకానీ, “దేహి” కి కాదు
అంటే, “మనకు” కాదు
పంచ జ్ఞానాంద్రియాల ద్వారా బహిర్ జ్ఞానం
“శరీరం లోపలి చైతన్యాన్ని” అంటే “దేహి” ని చేరి
దానిని ఉత్తేజపరచేదే, “మన” కు “ఆహారం”
పంచ కర్మేంద్రియాల ద్వారా,
“మనం” చేసే చేష్టలే మన “వ్యవహారం”
మన వ్యవహారం ఇతరులకు ఆహారం అవుతుంది.
ఇతరుల వ్యవహారం మనకు ఆహారం అవుతుంది.
ఉదాహరణకు :
మన మాటలు ఇతరులకు వారి చెవుల ద్వారా వారికి “ఆహారం” అవుతుంది :
మన చేష్టలు ఇతరులకు వారి కళ్ళ ద్వారా “ఆహారం” అవుతుంది
* మన వ్యవహారం ఇతరులకు ఆహారం
* ఇతరుల వ్యవహారం మనకు ఆహారం