ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త
ఆహారంలోజాగ్రత్త .. వ్యవహారంలో జాగ్రత్త ..
ఆహార వ్యవహారాలు .. రెండింటిలో జాగ్రత్తగా వుండాలి.
దేహానికి ఆహారం అన్నది వేరే .. “దేహి” కి ఆహారం అన్నది వేరే ..
దేహానికి ఆహారం .. కర్మేంద్రియమైన నోటి ద్వారా లభిస్తుంది
“దేహి” కి ఆహారం .. పంచజ్ఞానేంద్రియాల ద్వారా లభ్యం
యుక్తమైన ఆహారాన్నే సదా స్వీకరించాలి
“యుక్తాహార విహారస్య” .. అన్నారు కదా భగవద్గీతాచార్యుల వారు.
దేహానికి అయుక్తమైన ఆహారాన్ని .. తృణీకరించాలి
దేహపరమైన అయుక్త ఆహారం .. మాంసాహారం
“దేహి” పరమైన అయుక్త ఆహారం .. చెత్తకబుర్లు .. ప్రాపంచిక కబుర్లు ..
“దేహి” కి అయుక్తమైన ఆహారాన్ని కూడా నిశ్చయంగా తృణీకరించాలి
“దేహి” పరమైన “ఇంద్రియ విహారం” యుక్తంగా ఉండితీరాలి
పంచ జ్ఞానేంద్రియాల్లో “శ్రవణేంద్రియం” అన్నింటికన్నా మౌలికమైనది
ఉత్తములూ .. ఉన్నతులూ .. శాస్త్రజ్ఞులూ .. మరి యోగులూ అయినవాళ్ళ మాటలే వినిపించుకోవాలి
ఉత్తములూ .. ఉన్నతులూ .. శాస్త్రజ్ఞులూ .. మరి యోగులూ అయినవాళ్ళ పుస్తకాలే చదవాలి
అలాగే “వ్యవహారం” ..
“యుక్తచేష్టస్య కర్మను” అన్నారు కదా భగవద్గీతాచార్యులవారు.
“వ్యవహారక్షేత్రం” అంటే “చేష్టాక్షేత్రం”
“వ్యవహారక్షేత్రం” అంటే “వాక్ క్షేత్రం”
ఇతరుల మాటలు మనకు ఆహారం ..
మన మాటలు ఇతరులకు ఆహారం
“మన వ్యవహారం సరిగ్గా వుండాలి” అంటే .. “మన మాటలు సరిగ్గా వుండాలి”
మన మాటలు “సరియైన వ్యవహారం” తో .. “ఇతరులకు సరియైన ఆహారం” అందించాలి
“దేహి” పరంగా .. ఇంకా ..
“ఆహారక్షేత్రం” అంటే “శ్రవణేంద్రియక్షేత్రం” .. అంటే “సజ్జనసాంగత్యక్షేత్రం”
“ఆహారక్షేత్రం” అంటే “గ్రంధాధ్యయన క్షేత్రం” ..
ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాదులే .. “దేహి” కి విశేషమైన ఆహారపదార్థాలు.
“దేహికీ”, మరి “దేహానికి” రెండింటికీ .. అవసరమైన ప్రాణాహారం “ధ్యానం” ద్వారా లభిస్తుంది
“ప్రాణాహారక్షేత్రం” అన్నది “శ్యాసక్షేత్రం”
ఆహార వ్యవహార క్షేత్రాల్లో జాగ్రత్తగా వుండాలి
తస్మాత్ జాగ్రత్త… జాగ్రత్త… జాగ్రత్త…
యుక్తాహార విహారస్య – యుక్తచేష్టస్య కర్మసు
యుక్తస్వప్నావబోధస్య – యోగోభవతి దుఃఖహా
భగవద్గీత .. 6-17