ఆహార వ్యవహారాలలో జాగ్రత్తవహించాలి

 

“ఆహారంలో జాగ్రత్త వహించాలి”
అంటే
“చెడు వినరాదు .. చెడు చూడరాదు”
“చెడు” అంటే “పనికిరానివి” అన్నమాట
అంటే “మనకు అనవసరమైన వాటిని మనం పట్టించుకోరాదు” అని

అలాగే
“వ్యవహారంలో జాగ్రత్త వహించాలి”
అంటే “చెడు పలకరాదు” అని;
“మనకు తెలియనివి తెలిసినట్లు పలుకరాదు” అని
“ఉభయత్రా అనవసరపు మాటలు ససేమిరా కూడదు” అని

ఇదే మహాత్మాగాంధీజీ గారి “మూడు కోతుల” నీతి సూత్రం

పనికిరాని దృశ్యాలు చూడరాదు
పనికిరాని మాటలు వినరాదు
పనికిరాని మాటలు పలుకరాదు