ఆహార-ఆరోగ్య-ఆనంద శాస్త్రం

 

యుక్తాహారం”

యుక్తాహారం అంటే శాకాహారం

యుక్తాహారం అంటే సాత్వికాహారం

శ్రేష్ఠకరమైన యుక్తాహారం అంటే ఫలాహారం

మితాహారం”

ఆకలి ఉన్నప్పుడే తినాలి

ఆకలి లేనప్పుడు ససేమిరా తినరాదు

ఆకలి ఎంతుందో అంతకన్నా రెండు ముద్దలు తక్కువే తినాలి-

ఎప్పుడూ నాభి దాకానే తినాలి పీకల దాకా కాదు

ఎంత తినాలో అంతకన్నా ఎక్కువ తింటే ఏ దేవుడూ రక్షించలేడు-

ఎంత తినాలో అంతకన్నా తక్కువ తింటే ఏ దేవుడూ అక్కరలేదు

నిరాహారం”

వారానికి ఒకరోజు నిరాహారిగా ఉండాలి

అంటే ఉపవాసం ఉండాలి –

“లంఖణం పరమౌషధం” అన్నారు కదా…

రుచికర భోజనం”

ఆహారం కడుపు యొక్క ఆకలి కోసమే కాదు

ఆహారం ఆత్మ యొక్క ఆనందం కోసం కూడా

రుచికరమైన భోజనం ఉంటేనే ఆత్మకు ఆనందం

జీవితం అన్నది వివిధరకాల రుచుల ఆస్వాదం కోసమే ఉన్నది

“వైరాగ్యం” అన్నది జీవితం యొక్క లక్ష్యం కానేకాదు

“వైభోగం” అన్నదే జీవితం యొక్క లక్ష్యం

అందరూ పాకశాస్త్ర ప్రవీణులు కావాలి

జీవితం ఒక నిరంతర సంబరం

జీవితం ఒక అంతులేని దైనందిన సంబరం

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ అనుదిన సంబరాలకు అంకితం

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ యుక్తాహారానికి అంకితం

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ శాకాహారానికి అంకితం

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ మితాహారానికి అంకితం

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ నియమిత నిరాహారానికి అంకితం

ఇతి పిరమిడ్ ఆహార-ఆరోగ్య-ఆనంద శాస్త్రః”