హనుమంతుడి తోక

 

మనం అంతా కూడా మౌలికంగా “ఆత్మ చైతన్య శకలాలం”
ఈ సత్యాన్ని గుర్తించి .. మనల్ని మనం
“మౌలిక ఆత్మచైతన్య శకలాలు”గా .. ఒప్పుకోవడమే ఆధ్యాత్మికత!
ఆత్మపరిణామ దశలో భాగంగా .. నేర్చుకోవలసిన పాఠాలను అనుసరించి మనం
ఒక్కోసారి వృక్ష-జంతు లోకాలలో “సామూహిక ఆత్మచైతన్య శకలాలు”గా
ఇంకోసారి మానవ లోకంలో “వ్యక్తిగత ఆత్మచైతన్య శకలాలు”గా
మరి “బుద్ధిగత ఆత్మచైతన్య శకలాలు”గా
జన్మలు తీసుకుంటూ వుంటాం .. అంతేగాక
సూక్ష్మకారణ లోకాలలో ఉన్నత లక్ష్యంతో
అత్యంత ఎరుకతో కూడిన “సామూహిక ఆత్మచైతన్య శకలాలు” గా
మనం విరాజిల్లుతూ వుంటాం .. ఎంత ఎదిగినా
మనం విరాజిల్లుతూ వుంటాం .. ఎంత ఎదిగినా
మనం ఈ భూమి మీదకు వస్తూ .. పోతూ ఉంటాం!
‘A’ స్థితి నుంచి ‘Z’ స్థితికి .. పూర్ణాత్మ అవుతూ .. వెళ్తాం
మళ్ళీ “‘A’ to `Z’ ” .. మళ్ళీ .. “Z’ to `A’ “
సామూహిక చైతన్యం నుంచి వ్యక్తిగత చైతన్యానికీ ..
వ్యక్తిగత చైతన్యం నుంచి మళ్ళీ సామూహిక చైతన్యానికీ
కలిసి .. విడిగా .. మళ్ళీ కలిసి .. ప్రయాణం చేస్తూ ..
అనుభవ జ్ఞాన పాఠాలు నేర్చుకుంటూ .. సృష్టికి “సహసృష్టి” చేస్తూ ..
తనను తాను ఎప్పటికప్పుడు ఉద్ధరించుకుంటూ ఉండడమే
ఆత్మ యొక్క పరమ లక్ష్యం!
“ఆత్మ” అన్నది “హనుమంతుడి తోక” .. అది అలా సాగుతూనే ఉంటుంది!
“ఆధ్యాత్మికత”కు భూలోక సాంప్రదాయాలతో,
భూలోక కర్మకాండలతో ఎంత మాత్రం సంబంధం లేదు