శని దేవుడు

 

మనం అంతా

దివ్యలోకాల నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళం!

దివ్యలోకాలలో ఉన్నప్పుడు దివ్యలోకవాసులం

భువిలో ఉన్నప్పుడు భూలోకవాసులం

ఇలా దివి నుంచి భువికి దిగివ చ్చిన దేవుళ్ళందరూ సృష్టికి విషిష్ఠ అల్లుళ్ళు!

అందుకే ప్రకృతి మాత అల్లుళ్ళందరికీ సమకూర్చిపెడుతుంది!

***

అయితే .. “అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని” అన్నట్లు

కొందరి అల్లుళ్ళ నోళ్ళల్లో శనిదేవుడు కొలువై ఉన్నాడు!

దాంతో అంతా రసాభాస .. అంతా అస్తవ్యస్తం ..

అంతా దుఃఖం .. అంతా అంధకారం..

భోగం పాళ్ళు బహు తక్కువ! రోగం పాళ్ళు బహు ఎక్కువ!

***

ఇంతకూ “నోట్లో శని” అంటే??

తినకూడనివి తినడమే “నోట్లోశని” అంటే!

మాట్లాడకూడనివి మాట్లాడడమే “నోట్లో శని” అంటే!

“మాంస భక్షణ” అన్నది దిగివచ్చిన దేవుళ్ళను మృగాలుగా తయారుచేస్తోంది

మాంసాహారం అన్నది “50% శనిదేవుడు

ఇకపోతే వాక్కులో అనాగరికత

వాక్కులో దరిద్రత .. వాక్కులో అసభ్యత

వాక్కులో అశాస్త్రీయత .. వాక్కులో అనాధ్యాత్మికత

ఇదంతా వెరసి మరొక “50% శాతం శనిదేవుడు

ఈ విధంగా 100% శనిదేవుడు అల్లుడినోట్లో కొలువై ఉంటే

అల్లుడికి ఇక భోగం ఎక్కడిది?

సృష్టిమాతకు అల్లుడిగా వున్నా ఏం లాభం?

మానవులంతా సంపూర్ణంగా శుద్ధ శాకాహారులయినప్పుడు

అల్లుడినోట్లో “శనిదేవుడు” సగం మాయమైనట్లు

ఆ తరువాత అందరి వాక్కులు శుద్ధమైనప్పుడు .. అందరి వాక్కులు ఆధ్యాత్మికమయమైనప్పుడు

అందరి వాక్కులు శాస్త్రీయం అయినప్పుడు .. అందరి వాక్కులు సభ్యతతో నిండినప్పుడు

మిగతా అర్థభాగం “శనిదేవుడు” పూర్తిగా అదృశ్యం చెందుతాడు

అల్లుడి నోట్లో “శనిదేవుడు” లేకపోతే ఇక అంతా వీర భోగమే ..

ఆత్మజ్ఞానం లేనందువల్లే అల్లుడి నోట్లో “శనిదేవుడు” వున్నాడు

నోట్లో శనిదేవుడు పోతే అంతా నందనవనమే

భూలోకం దివ్యలోకమే .. మరి భూతలం స్వర్గతుల్యమే

***

ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా మాత్రమే

 మానవ జీవితాలలో దరిద్రం, నరకం అన్నవి మాయం అవుతాయి

శనిదేవుడు” 100% మటుమాయం అవుతాడు

మానవులందరి నోళ్ళల్లో శనిదేవుడు పూర్ణంగా అదృశ్యమయ్యే యుగం

మనం అతి త్వరలో దర్శించబోతున్నాం!

***

ఆ నవ్య-దివ్య-భవ్య యుగం కోసమే

పిరమిడ్ మాస్టర్లు ఇంతవరకూ ఎంతో కష్టపడ్డారు ..

ఇంకా, ఇంకా ఎంతో కష్టపడుతూనే వుంటారు

వారందరికీ మౌనధ్యాన శుభాకాంక్షలు!!