సహజ మోక్ష మార్గం

 

 

“మోక్షం” అనే పదానికి
విడుదల, అపవర్గం, నిర్వాణం, ముక్తి .. ఇత్యాదివి పర్యాయ పదాలు!
“మోక్షం” అంటే .. మౌలికంగా “విడుదల”
“మోక్షం” అంటే .. సత్యం గురించిన సకల సందిగ్ధతల నుంచి “విడుదల”
“మోక్షం” అంటే .. అన్ని రకాల భయాలు, ద్వేషాలు, అహంకారాలు
అసూయలు, ఆత్మన్యూనతలు, అజ్ఞానాలు మరి
అమాయకత్వాల నుంచి “విడుదల”
“మోక్షం” అంటే .. “భగవంతుడు వేరు.. నేను వేరు” అన్న
మూల అపోహ నుంచి “విడుదల”
“మోక్షం” అంటే .. అనవసరమైన వ్యర్థసంభాషణల నుంచి “విడుదల”
“మోక్షం” అంటే .. స్వీయ దివ్యజ్ఞానప్రకాశపు ఎదుగుదల పట్ల ఎరుక
“మోక్షం” అంటే ..
పుట్టుకకు ముందు జీవితం గురించీ ..
మరణానంతర జీవితం గురించీ మరి
జనన మరణాల మధ్య ఉన్న జీవితం గురించీ అవగాహన చేసుకుని
వున్న పరిస్థితులలో .. ప్రతిక్షణం ఆనందంగా జీవించడం!