సాహసం

 

ఉన్నత తలాలలో విరాజమానమై ఉన్న ఒకానొక ఆత్మ
అనేకానేక యుద్ధ తంత్రాలతో కూడిన సాహస యోద్ధుడిలా ..
పరిమిత మూడవ తలానికి చెందిన భూగ్రహానికి ప్రయాణమై ..
ఒక్కోసారి మోక్షాపేక్ష -రహిత ఆత్మగా
ఇంకోసారి మోక్షాపేక్ష-సహిత ఆత్మగా
నిత్య ఎరుక స్థితలో .. లేదా .. ఎరుక ఎంతమాత్రం లేని స్థితిలో
ద్వంద్వత్వపు ఆట ఆడుతూ అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది!
ఆటను “ఆట” లా అర్థం చేసుకున్ననాడు
ఒకానొక బుద్ధునిలా .. ఒకానొక కృష్ణునిలా .. విరాజిల్లుతూ వుంటాం!
ప్రతి ఆత్మ .. తన ప్రతి భూగ్రహ జీవితపు “క్షణభంగుర ఆట” ను
అత్యంత తెలివిగా ఆడుకుంటూ ..
“సహజ మోక్ష మార్గం” లో పయనిస్తూనే ఉంటుంది!