ఆచార్యుడు
“యః యాచినోతి, ఆచరతి, ఆచారయతి చ సః ఆచార్యః”
అని “ఆచార్య” ని యొక్క నిర్వచనం
యః = ఎవడైతే
యచినోతి = (జ్ఞానాన్ని) యాచిస్తాడో
ఆచరతి = ఆచరిస్తాడో
చ = మరి
ఆచారయతి = ఆచరింపచేస్తాడో
సః = అతడు
ఆచార్యః = ఆచార్యుడు
“యాచించడం”
అంటే, “ఆత్మజ్ఞానాన్ని యాచించడం” అన్నమాట
ఆచార్యుడు అన్నవాడు మొదట అనేక గురువుల ద్వారా
ఆత్మజ్ఞానాన్ని, సేకరించి, సాధన ద్వారా దానిని తన స్వానుభవంగా మార్చి,
ఆ తరువాత అదే విధమైన ఆత్మాభ్యాసాన్ని
ఇతరుల చేత కూడా ఆచరింపచేస్తూ వుంటాడు
ప్రతి ఒక్కడూ “ఆచార్యుడు” కావాలి;
ఆచార్యుడు కావడానికి ప్రయత్నం చేయాలి
ఆచార్యుడు అయ్యేంతవరకూ మనం
తిరిగి తిరిగి రావాల్సిందే; తిరిగి తిరిగి పుట్టాల్సిందే.