‘భక్తి’ యోగం

 

“యోగం”
అంటే
ఏదేని “సాధన”

వాస్తవానికి “భక్తియోగం” అన్నది లేనే లేదు
‘భక్తి’ అనేది ఓ సాధనా విషయం కాదు
‘భక్తి’ ఒక సిద్ధ స్థితి
“కర్మయోగం” అన్నది వుంది
“రాజయోగం” అన్నది వుంది
“జ్ఞానయోగం” అన్నది వుంది
కానీ, “భక్తియోగం” అన్నది మాత్రం లేదు

కర్మయోగ సాధన చేయాలి;
జ్ఞానయోగ సాధన చేయాలి;
రాజయోగ సాధన చేయాలి;
అయితే,
ఒకానొక ధ్యానయోగి అయిన తరువాత,
ఒకానొక పరిపక్వ జ్ఞాని అయిన తరువాత,
ఆ సిద్ధపురుషుడి సహజ మనోస్థితే “భక్తి”
‘భక్తి’ అనేది ఆత్మయొక్క పరిణామక్రమంలో అంతిమదశ యొక్క నిజస్థితి
ఈ స్థితిలో “నేను”, “నా” అనేవి వుండవు
“స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే”
“స్వస్వరూపంతో అనుసంధానమే ‘భక్తి’ అని పిలువబడుతోంది”
“నేను” , “నా” అన్నది లేని స్థితే నిజమైన “స్వస్థితి”

  • “భక్తి” అంటే –
    అన్నింటిలో మనల్ని మనం చూసుకునే స్థితి;
    మనలో అంతటినీ చూసుకునే స్థితి;
    ‘స్వ’ , ‘పర’ భావనలు శూన్యమైన స్థితి
  • యోగసాధనకు ఉపక్రమించక ముందు “మూఢభక్తి” –
    యోగసాధన పూర్ణమయిన తరువాత “సద్యోభక్తి”