ధ్యాన పుష్పం – జ్ఞాన పరిమళం
ఆత్మజ్ఞానం లేని మానవులు పరిమళం లేని పుష్పాలు;
పరిమళం అనేది ఒక పుష్పం యొక్క ఆరా;
ఆ పరిమళం ఎంత దూరం విస్తరించి ఉంటుందో అంత మహత్తు ఆ పుష్పానికి వుందన్న మాట ;
ప్రతి మనిషి యొక్క శక్తి, జ్ఞానం, చైతన్యం అనేవి పూర్తిగా విస్తరించుకుని వుండాలే కానీ కుంచించుకుని వుండరాదు.
మనస్సు లోని శక్తి, జ్ఞాన, చైతన్యాలు విజృంభించాలంటే ధ్యాన – స్వాధ్యాయ – సజ్జన సాంగత్యాలు మరి తప్పనిసరి.
శక్తి అన్నది ధ్యానం వల్లనే విజృంభిస్తుంది ; జ్ఞానం స్వాధ్యాయం వల్లనే వ్యాప్తమౌతుంది.
చైతన్యం సజ్జన సాంగత్యం వల్లనే విస్తృతమౌతుంది.
ధ్యాన – స్వాధ్యాయ – సజ్జన సాంగత్యా లే మనిషిని విధిగా ప్రతిరోజూ చేయవలసిన నిత్య కార్యక్రమాలు.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్, ఇండియా వారి ప్రచార నినాదం … ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలే.
ఏ మనిషిలో ధ్యాన – స్వాధ్యాయ – సజ్జన సాంగత్యాల ద్వారా శక్తి – జ్ఞానం – చైతన్యం అన్నవి విస్తరించి వుంటాయో ఆ మనిషి బ్రహ్మాండమైన పరిమళ సహితుడైన పుష్పం అవుతాడు. అతని ఖ్యాతి లోకలోకాలకూ విస్తరిస్తుంది. ఆ పరిమళం సమస్త సృష్టినే ముంచేస్తుంది.
ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అంతులేని జ్ఞాన పరిమళ భరితుడైన ఓ ధ్యాన పుష్పం. ఆంధ్రదేశం అంతా మొత్తం ధ్యాన పరిమళ మయం కావాలి