స్వామి చిన్మయ

 

స్వామి చిన్మయ గురించి తెలయనివారు ఎవ్వరూ వుండరు – భారతదేశంలో కానీ, యావత్ ప్రపంచంలో కానీ,

ఆయన ఓ వన్‌మేన్ – ఆర్మీ లా భూమండలంలో కదం త్రొక్కారు. ఎవ్వరికీ ఊపిరి ఆడనివ్వలేదు. తాను ఊపిరి కూడా తీసుకోకుండా శ్రమపడ్డారు.

ఏమిటో తపన అందరినీ బాగు చెయ్యాలని, అదీ తక్షణమే, ఆత్మజ్ఞానాన్ని బోధ చెయ్యాలంటే ఉర్రూతలూగేవారు. ఆయనకు భగవద్గీత, ఉపనిషత్‌లు మొదలయినవన్నీ కొట్టిన పిండి.

స్వామి శివానంద, స్వామి తపోవన్‌జీ గార్ల దగ్గర శిష్యరికం అన్నది తాను మాస్టర్ గా విలసిల్లడం కోసమే చేశారు.

  • చిన్న పిల్లలకు వుండే చిలిపితనం – యువకులకు వుండే ఆవేశం;
  • ప్రౌఢులకు వుండే కార్యదీక్ష – వృద్ధులకు వుండే లోకజ్ఞానం;
  • యోగులకు వుండే ఏకాగ్రత – ఋషులకు వుండే దార్శనికత;
  • ప్రవక్తలకు వుండే వేగం – నాయకులకు వుండే వాక్పటిమ;
  • రాజులకు వుండే రాజసం – చక్రవర్తులకుండే ఠీవి;

– అన్నీ ఒకే మనిషిలో రంగరించి వున్న అసామాన్యుడు స్వామీ చిన్మయ.

1976 లో ఆయన దగ్గర కూర్చుని వేణువు వాయించే భాగ్యం నాకు కల్గింది. కర్నూలులో, He immensly enjoyed my Flute and commented, “where were you all these days?” పది సంవత్సరాల తరువాత హాంకాంగ్ లో మళ్ళీ రెండవసారి కలయిక.

చిన్మయ అంటేనే భగవద్గీత, భగవద్గీత అంటేనే చిన్మయ.

జ్ఞానయజ్ఞాలు ఆయనతోనే ప్రారంభం అయ్యాయి, భారతదేశం లోనూ ప్రపంచంలోనూ లెక్కలేనన్ని ఆధ్యాత్మిక పాఠశాలలు స్థాపించిన సాంఘిక సంస్కర్త.

ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యత అద్వితీయం. ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు.

గత 2,3,4 దశాబ్డాలలో భారతీయులందరూ తమ మీద తాము గౌరవపడేలా చేసిన ఏకైక వ్యక్తి. ప్రతి పిరమిడ్ మాస్టరూ, స్వామిజీ దగ్గర నుంచి స్ఫూర్తి ని తీసుకోవాలి.

ఒకసారి స్వామి చిన్మయ గారు మరి డా|| శ్రీ పాద పినాకపాణి గారు కార్లో వెళ్తున్నారు.

పినాకపాణి గారు కర్నూలు చిన్మయ మిషన్ ప్రెసిడెంట్‌గా వుండేవారు. పినాకపాణి గారు అన్నారట చిన్మయానందంతో “What Vivekananda started, you are finishing” అని.

చిన్మయ ఫక్కున నవ్వి “I am completing what he had started, not finishing what he has sarted” అని గలగలా నవ్వారట.

చిన్మయ నామ ఆత్మజ్ఞాన, అద్వైత శిఖరానికి

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీల మాస్టర్ల అందరి తరపున ఆత్మాభివందనాలు.