అప్పోదీపోభవ
బుద్ధుడు
తన జీవితంలో చివరిగా
తన ప్రియతమ అనుచరుడు,
మరి శిష్యుడు అయిన ఆనందుడికి ఇచ్చిన సందేశం ఇది:
“ఓ ఆనందా ! నీకు నువ్వే దిక్కువి కా !
ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడవద్దు
నీ ముక్తిని నువ్వే శ్రద్ధతో సంపాదించుకో !”
“అప్పో దీపో భవ” అంటే
“నీకు నువ్వే దిక్కువి కా” అని
అంటే
“Be A Light Unto Yourself “
అని
అప్పో = నీకు నువ్వే
దీపో = దీపమువి, దిక్కువి
భవ = అవు
* “నీకు నువ్వే దిక్కువి కా” అన్నదే పరమసత్యం
* “తులసీదళ” పాఠకులందరకూ ఇదే ప్రథమ,
మరి అంతిమ సందేశం