అరిహంత్ .. శుభాశుభపరిత్యాగీ
అరి + హంత్ ..
అరి = శత్రువు
హంత్ = హతం చేసినవాడు
“అరిహంత్” అంటే .. “శత్రువును హతం చేసినవాడు”
* * *
జీవుడికి ముగ్గురు శత్రువులు
మొదటి శత్రువు .. అన్ని సందర్భాలలోనూ .. తమోగుణం
రెండవ శత్రువు .. అనేక సందర్భాలలో .. రజోగుణం
మూడవ శత్రువు .. అనేక సందర్భాలలో .. సాత్విక గుణం
* * *
“తమోగుణం” అంటే .. “అలసత్వం”; “రేపటికి వాయిదా వేసే వాయిదా వేసే తత్వం”
అలసత్వం ఎప్పుడూ వుండకూడదు; రేపటికి ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు
“శుభస్య శీఘ్రం” .. “ఆలస్యం అమృతం విషం”
A stitch in time saves nine”
తమోగుణం సర్వవేళలా ..సర్వపరిస్థితులలో .. త్యజించవలసిన గుణం
అంపశయ్యమీద వున్నప్పుడు కూడా భీష్ముడికి పని అప్పచెప్పాడు – శ్రీకృష్ణుడు ..
ధర్మరాజుకు ధర్మబోధ చెయ్యమనీ .. రాజనీతి సూత్రాలు చెప్పమనీ
* * *
ఇకపోతే రెండవ శత్రువు .. అనేక పరిస్థితుల్లో .. “రజోగుణం”
“రజోగుణం” అంటే” శక్తివంతంగా అనేకానేక పనులు చేయడం”
ఇది చాలా మంచిదే, అయితే అన్ని పరిస్థితులలోనూ కాదు
సత్యాసత్య విచారణ లేకుండా మాటలు పలుకరాదు
అన్ని విధాలా ఆలోచించకుండా పనులకు ఎగబడరాదు
ఉద్రేకాలకులోనై శక్తికి మించిన పనులు ఎప్పుడు చేపట్టరాదు
ఈ విధంగా ఎన్నో .. ఎన్నో .. ఉదాహరణలు..
రెండవ శత్రువును జయించే తీరాలి.
చివరిగా మూడవ శత్రువు .. అనేక సందర్భాలలో .. “సాత్విక గుణం”
“సాత్విక గుణం” అంటే” అనుక్షణం శుభం చేయడంలో జీవించడం”
“సర్వదా కళ్యాణ కార్యక్రమాల్లో వుండడం”
అయితే, ఎక్కువగా మంచి కూడా చేయరాదు
ఎక్కువగా సహాయం కూడా చేయరాదు
ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికే దోహదం చేయాలి
మరొకళ్ళ పనులు ఎప్పుడూ చేయరాదు.
మరొకళ్ళ పనులు చేయడం” మంచితనం” కాదు అది” వెర్రితనం”
మన స్వంతపనులకు మనమే చేసుకోవాలి
మిగతావాళ్ళ పనులను .. వాళ్ళ చేతే .. చేయించాలి
ఈ విధంగా “సాత్విక గుణం” కూడా అనేక సందర్భాల్లో శత్రువుగా పరిణమిస్తుంది.
కనుకనే భగవద్గీతలో శ్రీకృష్ణులవారు .. “శుభాశుభ పరిత్యాగీ” అన్నారు.
“అశుభ పరిత్యాగం” అన్నది వెంటనే అందరికీ అర్థం అవుతూనేవుంటుంది.
కానీ .. “శుభ పరిత్యాగం”?
“సాత్వికం” అన్నదానిని .. అంటే “శుభాన్ని” కూడా .. అనేక సందర్భాల్లో సంపూర్ణంగా త్యజించాలి
ఈ విధంగా మూడు శత్రువులనూ సంపూర్ణంగా జయించినవాడే “అరిహంత్”
పిరమిడ్ మాస్టర్లందరూ గొప్ప అరిహంత్ లు
నమో అరిహంతాణాం, నమో నమో అరిహంతాణాం
అరిహంతులందరికీ నమస్కారం
అరిహంతులందరికీ మహా మహా నమస్కారాలు.