పారిజాత పుష్పాలు 

 

“ఎన్‌లైటన్‌మెంట్” అన్న ఆంగ్ల పదానికి తెలుగులో “యథార్థజ్ఞానప్రకాశం” అని ఒక అర్థం

ఇంకో విధంగా చెప్పుకోవాలంటే…

“ఎన్‌లైటన్‌మెంట్” అంటే “బుద్ధి యొక్క సంపూర్ణ పరిపక్వ స్థితి” మరి

“మానవజాతి వికాసంలోని అత్యున్నతమైన పరాకాష్ఠ స్థితి”

మానవజీవితాన్ని మౌలిక యదార్థస్వరూపంగా తెలుసుకున్నవాడే “ఎన్‌లైటన్డ్ మాస్టర్”

మదర్ థెరిస్సా, మహాత్మగాంధీ లాంటివాళ్ళు ప్రాపంచికపరంగా ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్

గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఏసుప్రభువు లాంటి వాళ్ళు ఆధ్యాత్మికపరంగా ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్

సకలప్రాణికోటి యొక్క ఉన్నతికీ, ప్రగతికీ

చేత అయినంత సహాయ సహకారాలను సదా అందిస్తూ వుండేవాళ్ళే “ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్”

ప్రాపంచిక ఎన్‌లైటెన్‌మెంట్ – యథార్థజ్ఞానప్రకాశం .. అన్నది తొలిమెట్టు

ఆధ్యాత్మిక ఎన్‌లైటెన్‌మెంట్ – దివ్యజ్ఞానప్రకాశం .. అన్నది మలి మెట్టు

“నిరంతర పరోపకారం” అన్నది ప్రాపంచిక ఎన్‌లైటెన్‌మెంట్ అయితే

దానితో పాటుగా “పరలోక జ్ఞానాన్ని” పొందుతూ వుండటమే ” స్పిరిచ్యువల్ ఎన్‌లైటెన్‌మెంట్”

భువి కి సంబంధించినది “యథార్థజ్ఞానప్రకాశం” అయితే

“స్పిరిచ్యువల్ ఎన్‌లైటెన్‌మెంట్” అంటే “పరలోకజ్ఞానంతో కూడిన ఆత్మయొక్క పూర్ణ వికసితస్థితి”

పరలోక జ్ఞానంతో పరిపుష్ఠం అయివున్నవాళ్ళే దివ్యజ్ఞానప్రకాశంతో నిండిన మాస్టర్స్

“ఎన్‌లైటెన్‌మెంట్”కు “స్పిరిచ్యువాలిటీ” అన్నది తోడైతేనే పుష్పానికి తావి అబ్బినట్లు!

“తావి లేని పుష్పం” సంపూర్ణమైన పుష్పం కాజాలదు కదా!

ప్రతి మానవుడికి యొక్క ధ్యేయం.. దివ్యజ్ఞానప్రకాశంతో కూడిన

సుగంధపరిమళభూయిష్టమైన “పారిజాత పుష్పం”లా విలసిల్లడమే!

“పారిజాత పుష్పం” అన్నది భువి కి సంబంధించిన మామూలు పుష్పం కాదు ..

అది “దివి” కి సంబంధించిన “దేవలోకపు కుసమం”

స్పిరిచ్యువల్ ఎన్‌లైటెన్‌మెంట్ = “పారిజాత పుష్పం”

స్పిరిచ్యువల్ ఎన్‌లైటెన్‌మెంట్ =

ధ్యానభ్యాసం + సజ్జనసాంగత్య అభ్యాసం+ స్వాధ్యాయ అభ్యాసం

ఎంత ఎక్కువగా ధ్యాన అభ్యాసం చేస్తే..

ఎంత ఎక్కువగా స్వాధ్యాయం అభ్యాసం చేస్తే ..

ఎంత ఎక్కువగా సజ్జనసాంగత్య అభ్యాసం చేస్తే ..

అంత ఎక్కువగా మనం సుగంధ పరీమళభరిత దివ్యపారిజాత పుష్పాల్లా వికసిస్తాం

పిరమిడ్ మాస్టర్లందరూ దివ్యజ్ఞానప్రకాశంతో వికసించిన పారిజాత కుసుమాలు!

భూలోకంలో ఇక అందరూ పారిజాత పుష్పాలుగా వికసించెదరు గాక!